Allu Arjun : అల్లు అర్జున్ ఖాతాలోకి రూ.140 కోట్లు.. ఏంటి మ్యాట‌ర్‌..?

September 22, 2022 8:25 AM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయ‌న క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయ‌న మాస్ పాత్ర‌లో అల‌రించారు. పుష్ప మొద‌టి భాగం ఊహించ‌ని స్థాయిలో హిట్ అయింది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లోనూ డిమాండ్ ఏర్ప‌డింది. ఆయ‌న‌తో అక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక పుష్ప 2 కూడా త్వ‌రలోనే ప్రారంభం కానుంది.

అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్‌తో యాడ్స్ చేయించుకునేందుకు అనేక కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న మ‌రిన్ని యాడ్స్ చేయ‌నున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆ యాడ్స్ ద్వారా రూ.50 కోట్లు రానున్నాయ‌ట‌. ఒక్కో యాడ్‌కు బ‌న్నీ ప్ర‌స్తుతం రూ.7 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక పుష్ప మూవీకి గాను రూ.40 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను బ‌న్నీ తీసుకోగా.. ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఏకంగా రూ.90 కోట్లు అందుకోనున్నాడు. ఈ క్ర‌మంలో పుష్ప‌2 మూవీ రెమ్యున‌రేష‌న్, యాడ్స్ అన్నీ క‌లిపి రూ.140 కోట్ల‌ను త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ త‌న ఖాతాలో వేసుకోనున్నాడు. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ క్రేజ్‌, పాపులారిటీ చూసి ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

Allu Arjun to get rs 140 crores from ads and movies in coming months
Allu Arjun

ఇక పుష్ప 2 మూవీని రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. వాస్త‌వానికి ఈ మూవీ ఏప్రిల్ నెల‌లోనే లాంచ్ కావ‌ల్సి ఉంది. కానీ సుకుమార్ క‌థ‌ను సిద్ధం చేసేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ మూవీ మ‌రి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీన్ని వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now