Anchor Suma : యాంక‌ర్ సుమ‌, బ్ర‌హ్మాజీ.. ఏదేదో మాట్లాడి ఎక్క‌డికో వెళ్లిపోయారుగా..

September 21, 2022 6:39 PM

Anchor Suma : సుమ కనకాల.. బుల్లితెరపై ఏ షో అయినా, ఈవెంట్ అయినా మొదటగా వినిపించేది ఈ పేరే. సుమ కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ కి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. ఆమె యాంకరింగ్ అంటే ఒక గల గల ప్రవాహం లాంటిది. సుమ చేసే ప్రతి షో కూడా వీక్షకులు చూడటానికి ఎంతో ఇష్టపడతారు.

యాంకరింగ్ లో ఆమె మాట తీరు, నడవడిక, పెద్దవారి పట్ల ఆమె చూపించే గౌరవం అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ఆమె యాంకరింగ్ కి ఇండస్ట్రీలో కూడా సుమకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆమె మాట తీరుపై పాజిటివ్ గానే స్పందిస్తారు. యాంకర్ గా సుమ కెరియర్ ప్రారంభించిన మొదటి నుంచి ఇటిప్పటివరకైతే ఆమె యాంకరింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఇప్పటి యాంకర్ లాగా ఎవరినీ హర్ట్ చేయడం డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం వంటి పనులు సుమ చేసేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో సుమ కూడా యాంకరింగ్  విషయంలో హద్దులు దాటేస్తున్నట్టు అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Anchor Suma and Brahmaji conversation viral
Anchor Suma

ఇటీవల సుమ కనకాల నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వింద విహారి చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు యాంకరింగ్ చేసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ లో సుమ కనకాల తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ ఫుల్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ క్రమంలోనే యాక్టర్ బ్రహ్మాజీకి, సుమకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కామెడీ పండించే తీరులో బ్రహ్మాజీ, సుమ ఇద్దరిలో ఎవరినీ తీయాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే కామెడీ విషయంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. ఇక ఇద్దరు కూడా ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అమ్మో ఇక అసలు చెప్పలేం వారు చేసే ఫుల్ కామెడీతో అందరూ కడుపుబ్బా నవ్వి నవ్వి పొట్ట‌ చెక్కలు అవ్వాల్సిందే. ఈ ఈవెంట్ లో బ్రహ్మాజీ, సుమ మధ్య సంభాషణ  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

యాంకరింగ్ చేస్తూ మధ్యలో సుమ స్టేజ్ దిగి బ్రహ్మాజీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దీంతో హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుకుందామా అంటూ బ్రహ్మాజీతో సరదాగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది సుమ. ఈ క్రమంలోనే సుమ ఆయనని అడిగిన ప్రశ్నలు ఎక్కడికో దారితీశాయి. ఆమె మాట్లాడుతూ మీ ఏజ్ ఎంత..? అంటూ యాంకర్ సుమ బ్రహ్మాజీని ప్రశ్నిస్తుంది.

దీంతో బ్రహ్మాజీ కూడా నవ్వుతూ..యు నాటీ.. ఆంటీ.. అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. బ్రహ్మాజీ దెబ్బకు సుమ ముఖం వాడిపోయింది. అంతేకాదు ఈ విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది.. నాకెందుకీ ఖ‌ర్మ అంటూ సంభాషణను కట్ చేస్తుంది. దీంతో  వీరిద్దరి మధ్య జరిగిన సంభాష‌ణ‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రహ్మాజీ కామెంట్ చేసింది అనసూయని అంటూ కొందరు, మళ్లీ గత విషయాలని తవ్వుకుంటున్నారు అంటూ కొందరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు సుమ చిచ్చు పెట్టేసి మెల్లగా ఏమీ తెలియనట్లు తప్పించుకుంది అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై అన‌సూయ ఏమైనా కౌంట‌ర్ ఇస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now