Liger Movie : ఓటీటీలో లైగర్ మూవీ.. ఎప్పుడు, ఎందులో అంటే..?

September 20, 2022 10:06 PM

Liger Movie : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలై ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి భారీ నష్టాలను మూటకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ కెరీర్‏లోనే అతిపెద్ద డిజాస్టర్‏గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. థియేట‌‌‌‌‌ర్‌ల‌లో చూడని ప్రేక్షకులు లైగ‌ర్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైగ‌ర్‌ సినిమా సెప్టెంబ‌ర్ 22 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Liger Movie coming on ott know which app
Liger Movie

వాస్తవానికి ఈ సినిమాను 50 రోజుల త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి కానీ సినిమా ఫ్లాప్ అవ‌డంతో.. హాట్‌స్టార్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఆఫ‌ర్ చేసింద‌ట‌. అందుకే లైగ‌ర్‌ ముందుగానే ఓటీటీలోకి వస్తుందట. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన లైగ‌ర్‌ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా రూ.30 కోట్ల క‌లెక్ష‌న్లు మాత్రమే సాధించి మేక‌ర్స్‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. థియేటర్ ల‌లో నిరుత్సాహపరిచిన లైగర్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now