Student No.1 : స్టూడెంట్ నెం.1 సినిమాకి మొదట అనుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

September 19, 2022 8:56 PM

Student No.1 : దర్శకధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే రాజమౌళి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఇటీవల కాలంలో హాస్యనటుడు ఆలీ హోస్ట్ చేస్తున్న ఆలీతో సరదాగా షోకి పలువురు సెలబ్రెటీలు విచ్చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ గెస్ట్ గా వచ్చారు.

అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనేక విషయాలను చెప్పుకొచ్చిన అశ్వినీ దత్.. స్టూడెంట్ నెం.1 చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాల్సి ఉందని, అయితే హరికృష్ణ తనకు ఫోన్ చేయడంతో పరిస్థితులు మారిపోయాయని ఆయన తెలిపాడు. మేము ఊహించిన దాని కంటే జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని ఆయన తెలిపాడు.

do you know who is the first choice for Student No.1 movie
Student No.1

వైజయంతి మూవీస్ 2001లో నిర్మించిన స్టూడెంట్ నెం.1 సూపర్ హిట్ అయిన‌ విషయం తెలిసిందే. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్ ఆమధ్య వరస పరాజయాలతో కొనసాగుతున్న సమయంలో అల్లుడు నాగ్ అశ్విన్ మహానటితో వైజయంతి మూవీస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. అనంతరం జాతిరత్నాలు, మొన్న సీతారామం ఇలా వరుస విజయాలతో దూసుకుపోతుంది వైజయంతి మూవీస్. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుండగా దీనికి డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ ఉన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now