Naga Chaitanya : బిగ్ బ్రేకింగ్‌.. స‌మంత‌ను క‌ల‌వ‌నున్న నాగ‌చైత‌న్య‌.. అందుకే..?

September 17, 2022 5:20 PM

Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అనేక మంది అభిమానులు భవిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది. సమంత, నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించారు.

వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటిలో మజిలీలో మాత్రం పెళ్లి తర్వాత నటించారు. ఇదిలా వుండగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత, నాగచైతన్య పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత.. నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం.

Naga Chaitanya reportedly to meet Samantha
Naga Chaitanya

గతంలో నాగచైతన్యకి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. నో అయితే చెప్పనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య, సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకటైనా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం మాయ చేసావే 2 కి స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో..? మళ్లీ ఇద్దరిని మనం ఎప్పుడు తెరపై చూస్తామో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now