Viral Video : మెడలో తాళి పడగానే ఆపుకోలేకపోయిన వధువు.. పందిట్లోనే వరుడిని ఏం చేసిందో చూడండి..!

September 17, 2022 11:09 AM

Viral Video : పెళ్లి అంటే.. ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్ లు, షామియానాలు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజి పేరుతో అంతా అరువు తెచ్చుకున్న మనుషులు కాదు. పెళ్ళంటే జన్మకి ఒకేసారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు.. రెండు కుటుంబాలు జీవితకాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం. కొన్ని వేలమంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు.. ఈ మధ్యకాలంలో పిల్లలు తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిని చూపించి వారినే పెళ్లి చేసుకుంటామని చెబుతుంటారు.

దీనికి కొందరు పేరెంట్స్ అంగీకరిస్తుంటే మరికొందరు పిల్లల ఒత్తిడి మేరకు అంగీకరిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారిని చేసుకుని పెళ్లి తర్వాత బాధపడే బదులు.. బాగా తెలిసిన అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని నేటి యువత భావిస్తోందట.. ఈ క్రమంలో తమిళ సంప్రదాయంలో ఓ జంట పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరగగా.. అమ్మాయి, అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వీడియో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అయితే, పెళ్ళి కొడుకు తాళికట్టే వేళ పెళ్లికూతురు ఓవర్ ఎక్సైట్ అయ్యింది.

Viral Video see what bride did after marriage
Viral Video

ఆనందంతో చప్పట్లు కొట్టింది. అబ్బాయి తాళి కడుతున్నంత సేపు సైలెంట్‌గా చూస్తూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. ఈ రోజు కోసం ఆమె ఎంతగా ఎదురు చూసిందో అర్థమవుతుంది. తాళి కట్టిన అనంతరం ఆనందాన్ని ఆపుకోలేక అందరి ముందు పెళ్లి కొడుకు బుగ్గపై ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వీడియోను చూసి చాలా జంటలు కంగ్రాట్స్ అని విషెస్ చేస్తున్నారు. మరికొందరు అయితే అబ్బాయి కంటే అమ్మాయి చాలా సంతోషంగా ఉందనగా.. ఇంకొందరు ఇంకో సంవత్సరం తర్వాత కనిపించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment