Viral Video : వార్నీ.. ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. ముద్దులతో టీచర్‌ను ఎలా కూల్ చేశాడో చూడండి..!

September 16, 2022 8:03 PM

Viral Video : పిల్లలు అన్నాక‌ అల్లరి చేయడం.. టీచర్లు అన్నాక‌ మందలించడం సాధారణమే. చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి. అప్పుడప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. వారి చేష్టలకు పెద్దవాళ్లు కోపం తెచ్చుకుంటే కొందరు పిల్లలు చాలా స్మార్ట్‌గా ఆలోచించి కూల్ చేస్తారు. అలా ఓ పిల్లాడు తన టీచర్ కోపంగా ఉంటే కూల్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అదొక నర్సరీ స్కూల్.. పిల్లలందరూ తెగ అల్లరి చేస్తున్నారు.

ముఖ్యంగా ఓ బుడ్డోడు చేసే అల్లరిని టీచర్ అస్సలు తట్టుకోలేకపోయింది. ఇంకేముంది.. అతడిని దగ్గరకు పిలిచి.. నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్.. నీతో అస్సలు మాట్లాడను అని బుంగమూతి పెట్టింది. ఇక తన ఫెవరేట్ టీచర్ మాట్లాడకపోయేసరికి ఆ బుడ్డోడు టీచర్ ను బుజ్జగించడం మొదలుపెట్టాడు. ఇక నేను అల్లరి చేయను.. ప్లీజ్ మాట్లాడండి అంటూ బతిమాలాడాడు. లేదు.. ఇప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నువ్వు అలానే అల్లరి చేస్తున్నావ్ అంటూ టీచర్ ఇంకా అలక నటించింది.

Viral Video student responded for teacher angriness
Viral Video

ఇక చేయను.. ప్రామిస్ అంటూ.. తన దగ్గర ఉన్న బ్రహ్మస్త్రాన్ని సంధించాడు చిచ్చర పిడుగు. టీచర్ కు ముద్దుల వర్షం కురిసిపిస్తూ సారీ చెప్పాడు. దీంతో అలక మానిన పంతులమ్మ సైతం ఈ బుగ్గ మీద పెట్టు.. ఆ బుగ్గ మీద పెట్టు అంటూ అతడి మాటలకు తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మాకు ఇలాంటి టీచర్లు ఉండరు.. అని కొందరు. ఇలాంటి టీచర్లు ఉండాలే కానీ ఎంత బుద్దిగా చదువుకొనేవాళ్లం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment