Tollywood Heroes : టాలీవుడ్ హీరోలు ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారో తెలుసా..?

September 16, 2022 11:48 AM

Tollywood Heroes : తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు వారి నటనతో కట్టిపడేస్తున్నారు. అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేసేవారు, ఈ హీరోల వయసు ఎంత, అసలు ఏం చదువుకుని ఉంటారు అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు ఏంటో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కాలేజీ నుండి బీకాం డిగ్రీ పొందారు. నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఇండియా వచ్చి కలియుగ పాండవులు సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు.

టాలీవుడ్ మన్మథుడుగా పేరొందిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు. తరువాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ప్రవేశించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ లో బీబీఏ పూర్తి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశారు. మాస్ మహారాజ్ రవితేజ విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో బీఏ చదివాడు.

do you know what are the educational qualifications of these Tollywood Heroes
Tollywood Heroes

ప్రభాస్ భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత సినిమాల్లోకి వచ్చాడు. రానా చెన్నై ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రీయల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాడు. న్యాచురల్ స్టార్ నాని సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ చదివాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లోని కాచిగూడ బద్రుక కాలేజీలో బీకాం చేశాడు. అక్కినేని నాగ చైతన్య బీకాం చదివాడు. సాయి ధరమ్ తేజ్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. అలాగే నితిన్, రామ్, శర్వానంద్, సందీప్ కిషన్ వీళ్లంతా డిగ్రీ పూర్తి చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now