Nagarjuna : సీపీఐ నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!

September 14, 2022 7:28 AM

Nagarjuna : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఉరుకులు, పరుగులు, టాస్క్‌లు, లవ్‌లు, ఎఫైర్లు, బ్రేకప్.. అబ్బో ఒక్కటేమిటి కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్‌లు పెడుడూ ఉంటాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 6 విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఎంత సక్సెస్ అయ్యిందో అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది బిగ్ బాస్. బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తోంది. బిగ్ బాస్ ను ఘోరంగా విమర్శిస్తున్న వారిలో సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ ఒకరు.

అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ఏంటి.. డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జునపై నారాయణ విమర్శలు చేశాడు. అయితే నాగార్జున ఇలాంటి విమర్శలు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నారాయణ చేస్తున్న ఆరోపణలు రోజురోజుకు హద్దులు దాటుతుండడంతో ఏకంగా బిగ్ బాస్ వేదికపై నాగార్జున తన స్టైల్లో నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. శని, ఆదివారాల్లో హౌస్ లో నాగార్జున సందడి చేస్తుంటాడు.

Nagarjuna strong counter to Narayana for comments on bigg boss
Nagarjuna

ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్‌లో కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెరీనా రోహిత్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ మేరీనాని కాస్త బాగా చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాదు ఇతరుల విషయంలో ఏమో కానీ ఇక్కడ మీకు లైసెన్స్ ఉంది.. మీరిద్దరూ భార్యాభర్తలు మీరు ఇద్దరు హగ్ చేసుకోవడంలో తప్పులేదు అని.. వారు హగ్ చేసుకునే సమయంలో నారాయణ.. నారాయణ వారిద్దరికీ పెళ్ళయింది అంటూ సామెత చెపుతున్నట్టుగానే.. అంటూ నారాయణకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరూ భార్యాభర్తలని వీళ్ళు హగ్ చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా నాగార్జున.. సీపీఐ నేత నారాయణకు గట్టిగానే కౌంట‌ర్‌ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now