పోస్టాఫీస్ అందిస్తున్న మనీ బ్యాక్ స్కీమ్‌.. రూ.14 ల‌క్ష‌ల ఆదాయం పొందే అవ‌కాశం..!

June 14, 2021 9:38 PM

డ‌బ్బులు పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీసుల్లో ఎన్నో ప‌థ‌కాలు అందుబాటులో ఉన్న విష‌యం విదిత‌మే. అయితే చిన్న మొత్తం పెట్టుబ‌డి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాల‌ను అందించే స్కీములు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో గ్రామ్ సుమంగ‌ల్ రూర‌ల్ పోస్ట‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒక‌టి. ఇందులో రూ.95 పెట్టి సుదీర్ఘ కాలం త‌రువాత రూ.14 ల‌క్ష‌ల ఆదాయం పొంద‌వ‌చ్చు.

post office money back scheme can get rs 14 lakhs revenue

ఈ ప‌థ‌కం ఒక ఎండోమెంట్ ప్లాన్‌. ఇందులో ఫిక్స్‌డ్ సొమ్మును పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. మెచూరీ గ‌డువు ముగియ‌గానే డ‌బ్బులు చేతికి వ‌స్తాయి. అలాగే ప‌థ‌కంలో ఉన్న‌న్ని రోజులు ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ కూడా ల‌భిస్తుంది. ఇందుకు గాను పోస్టాఫీస్‌లో బ్యాంక్ అకౌంట్‌ను క‌లిగి ఉండాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బు పొందాల‌నుకున్నా ఈ స్కీమ్ ప‌నిచేస్తుంది. ఇందులో మెచూరిటీ గ‌డువు ముగియ‌క‌పోయినా 3 సార్లు ముందే డ‌బ్బు తీసుకోవ‌చ్చు. ఈ ప‌థకం కింద ఖాతాదారుల‌కు రూ.10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది.

మెచూరిటీ గ‌డువు 15 లేదా 20 ఏళ్లు ఉండేలా ఈ ప్లాన్‌ను ఎంచుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే క‌నీస వ‌య‌స్సు 19 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా వ‌య‌స్సు 45 ఏళ్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. 20 ఏళ్ల పాల‌సీ తీసుకునేందుకు గ‌రిష్ట వ‌య‌స్సును 40 ఏళ్లుగా నిర్ణ‌యించారు.

15 ఏళ్ల పాల‌సీలో బ్యాంకు క‌స్ట‌మ‌ర్‌కు 6 ఏళ్ల గడువు ముగిస్తే పెట్టిన దాంట్లో నుంచి 20 శాతం తీసుకోవ‌చ్చు. అదే సూత్రం 6, 9, 12 ఏళ్ల‌కు వ‌ర్తిస్తుంది. 20 ఏళ్ల పాల‌సీలోనూ 20 శాతం ఇస్తారు. కాక‌పోతే 8 ఏళ్లు, 12, 16 ఏళ్ల త‌రువాత ఆ మొత్తాన్ని తీసుకోవ‌చ్చు.

ఇక 25 ఏళ్లున్న ఒక వ్య‌క్తి 20 ఏళ్ల పాల‌సీ తీసుకుంటే పాల‌సీకి అషూర్ చేసిన మొత్తం రూ.7 ల‌క్ష‌లు అయితే రూ.2,853 నెల‌కు ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.95 అన్న‌మాట‌. ఈ క్ర‌మంలో 8, 12, 16 ఏళ్ల త‌రువాత ఖాతాదారుకు రూ.1.4 లక్ష‌ల చొప్పున‌ వ‌స్తాయి.

ఈ స్కీమ్‌లో వార్షిక బోన‌స్ ప్ర‌తి వెయ్యి రూపాయ‌ల‌కు రూ.48 చెల్లిస్తారు. ఈ క్ర‌మంలో రూ.7 ల‌క్ష‌ల‌కు రూ.33,600 అవుతుంది. 20 ఏళ్ల‌కు లెక్క వేస్తే బోన‌స్ రూ.6.72 ల‌క్ష‌లు అవుతుంది. ఈ క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్ కు 20 ఏళ్ల త‌రువాత రూ.13.72 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఇందులో రూ.4.2 ల‌క్ష‌లు ఆల్రెడీ మ‌నీ బ్యాక్ కింద ఇస్తారు. అలాగే రూ.9.52 ల‌క్ష‌ల‌ను మెచూరిటీ గడువు ముగిశాక ఇస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment