OTT : ఈ వారం ఓటీటీల్లో వ‌స్తున్న మూవీలు, సిరీస్‌లు.. ఇవే..!

September 12, 2022 11:56 AM

OTT : వీకెండ్ వ‌చ్చిందంటే చాలు వివిధ ఓటీటీ ప్లాట‌ఫామ్ లు కొత్త సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో సంద‌డి చేస్తూ ఉంటాయి. ఎంతో మంది ఓటీటీల‌లో రాబోయే షో లు , చిత్రాలు, వెబ్ సిరీస్ ల కోసం ఆతృత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ వారం కూడా నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్ లాంటి ఓటీటీ వేదిక‌ల‌పై ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప‌ల‌క‌రించ‌నున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వితేజ హీరోగా, మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ‌ కౌషిక్ హీరోయిన్ గా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం సెప్టెంబ‌ర్ 15 నుండి సోనీ లివ్ లో ప్ర‌సారం కానుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పాలైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. అలాగే బాలీవుడ్ న‌టుడు దిల్జిత్ దోసంజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జోగీ అనే సినిమా కూడా సెప్టెంబ‌ర్ 16 నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 1980ల నాటి సిక్కు అల్ల‌ర్ల నేప‌థ్యంలో సామాజిక కోణంలో ఈ చిత్రం సాగ‌నుంది.

movies and series releasing on OTT apps on 16th september 2022
OTT

ఇక‌ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన అటెన్ష‌న్ ప్లీజ్ అనే చిత్రం కూడా సెప్టెంబ‌ర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది. అలాగే ఓటీటీలో బాగా పాపుల‌ర్ అయిన కాలేజ్ రొమాన్స్ వెబ్ సిరీస్ కి సంబంధించిన‌ సీజ‌న్ 3 సోనీ లివ్ లో సెప్టెంబ‌ర్ 16 నుండి మొద‌లు కానుంది.

ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి మార్లిన్ మ‌న్రో జీవితం ఆధారంగా బ‌యోగ్ర‌ఫిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన బ్లాండే మూవీ సెప్టెంబ‌ర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ‌బోతుంది. అనా డే అర్మాస్ ఈ మూవీలో మార్లిన్ మ‌న్రో పాత్ర‌లో న‌టించింది. ఇలా ప‌లు మూవీలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now