Sai Pallavi : సాయిప‌ల్ల‌వి ఆయ‌న‌ను పెళ్లి చేసుకోనుందా.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!

September 12, 2022 8:58 AM

Sai Pallavi : ఫిదా చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి తన న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది సాయిపల్లవి. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు.

ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ ల‌లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. సాయి పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే డ్యాన్స్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సాయి పల్లవి డ్యాన్స్ ని మెచ్చుకున్నారంటే ఆమెలోని డాన్స్ టాలెంట్ ఎంత బాగుంటుందో వేరే చెప్పనవసరం లేదు. సాయి పల్లవి డాన్స్ స్టైల్ అంత‌ అద్భుతంగా ఉంటుంది.

Sai Pallavi marriage news viral she has given clarity
Sai Pallavi

సాయి పల్లవిని సినిమాల పరంగా కన్నా కూడా వ్యక్తిగతంగా ఇష్టపడే జనాలే ఎక్కువ ఉన్నారు. ఆమె టైం పంక్చువాలిటీ, ఆమె డెడికేషన్, ఆమె తీసుకునే నిర్ణయాలపై క‌చ్చితత్వం జనాలకు బాగా నచ్చుతాయి. ఏదైనా తను కథ నమ్మి సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తుంది.

నేటి తరం హీరోయిన్స్ లో ఎవరైనా ఇలాంటివారు ఇంకా ఉన్నారు అంటే అది సాయి పల్లవి మాత్రమే అని చెప్పుకోవచ్చు. తనకంటూ ఒక బౌండరీ గీసుకొని ఎంత డబ్బు ఎర చూపినా కూడా తల వంచకుండా ఆమె అనుకున్న పని చేసే తీరుతుంది. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా తనకు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నిరాకరిస్తుంది.

ఈ మధ్యకాలంలో సాయిపల్లవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఓ టాప్ పొలిటిషియన్ కొడుకు సాయి పల్లవికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని, దానిని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ వార్తలపై సాయి పల్లవి స్పందించినట్లు తెలుస్తుంది. ఆ వార్త నిజమైతే బాగుండు.. ఆ పొలిటిషియన్ కొడుకు ఎవరు.. నాకు చెప్పండి.. అంటూ ఫన్నీగా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొచ్చిందట.

దీంతో సాయి పల్లవి మైండ్ ఏమైనా పోయిందా అంటూ కొందరు ఆమెపై కామెంట్స్  చేస్తున్నారు. అంతేకాదు సాయి పల్లవి ఇలా మాట్లాడడంపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. మీపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు వస్తే మీరు ఖండించడం మానేసి చాలా తేలికగా తీసుకుంటే ఎలా. రేపు ఇంకొక వార్త మీ మీద ప్రచారం కావచ్చు.. బీ కేర్‌ఫుల్ అంటూ కామెంట్స్ రూపంలో వార్నింగ్‌ ఇస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now