Allu Arjun : బన్నీపై రెబ‌ల్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. మ‌రీ ఇలాగా ప్ర‌వ‌ర్తించేది అంటూ ట్రోల్స్‌..

September 11, 2022 4:39 PM

Allu Arjun : రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు మృతితో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మలో తీవ్ర విషాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉద‌యం నుండే సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ఇంకా వివిధ రంగాలకు చెందిన పెద్ద‌లు ఆయ‌న మృతికి సంతాపంగా నివాళులు అర్పించారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న భౌతిక కాయాన్ని సందర్శించగా ఎంతో మంది టీవీ, సోష‌ల్ మీడియా ఇంకా ఇత‌ర మాధ్య‌మాల ద్వారా త‌మ సానుభూతి ని తెలియ‌జేశారు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మహేష్ బాబు త‌దిత‌రులు కృష్ణం రాజు మృత‌దేహాన్ని సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఆయ‌న‌తో త‌మ అనుబంధాన్ని, జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ప్ర‌భాస్ ను కూడా ఓదార్చ‌డం జ‌రిగింది. అయితే ఇలాంటి సంద‌ర్భంలో అల్లు అర్జున్ రాక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంద‌ని సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు.

Allu Arjun being trolled by prabhas fans for his behavior
Allu Arjun

కాగా అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సైమా అవార్డ్సు ఫంక్ష‌న్ లో పాల్గొన‌డానికి బెంగ‌ళూరులో ఉన్న‌ట్టు తెలిసింది. దానికి సంబంధించిన వీడియో కూడా కృష్ణం రాజు మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న షేర్ చేయ‌డం జ‌రిగింది. అందువ‌ల‌న ఆయ‌న రాలేక పోయార‌ని టాక్ నడుస్తుంది. కానీ ఇంత వ‌ర‌కు రెబ‌ల్ స్టార్ మృతిపై క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా స్ప‌దించ‌క పోవ‌డంతో ఆయ‌న‌పై ప‌లు ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా కృష్ణం రాజు మ‌ర‌ణంపై స్పందించారు. ఆయ‌న మృతి త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని, సినీ ఇండ‌స్ట్రీకి ఆయ‌న చేసిన సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాని రాయ‌డం జరిగింది. దీంతో ఈ వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్లేన‌ని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now