Hyper Aadi : మంత్రి రోజాని హైపర్ ఆది అలా అనేశాడేంటి.. ఆది నోటి దూలపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

September 12, 2022 8:17 AM

Hyper Aadi : బుల్లితెరపై బెస్ట్ కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ళు గడిచినా ఆ షో హవా తగ్గడం లేదు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు. ఇక రీసెంట్ గా మాత్రం కొందరు.. నిర్వాహకులతో వచ్చిన విబేధాలతో షో నుంచి బయటకు వెళ్లిపోయారు. దానికి కారణాలు ఏవైనా కానీ షో మేనేజర్ ఏడుకొండలు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్స్ జబర్దస్త్ కంటెస్టెంట్లను ఏకిపారేశారు. వాళ్ళ దగ్గర పక్క ఆధారాలున్నాయని జబర్దస్త్ షోకి రాకుండా ఎలా తప్పుకుంటారో చూస్తానని ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలను నిజం చేస్తూ కొద్దిరోజుల క్రితమే గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు.

ఇదిలా వుండగా తాజాగా జబర్దస్త్ షోలోకి హైపర్ ఆది రీఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దానికి కారణం.. హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ నవ్వులు, పంచులు, డబల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే ఘాటు కౌంటర్లతో హంగామా చేస్తాడు. అయితే ఆది మొదటి ఎపిసోడ్ లోనే స్టార్స్ పై పంచులు వేసి హైలైట్ అయ్యాడు. హైపర్ ఆది ఎంట్రీ ఇస్తుండగా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నట్లు అతడికి స్వాగతం పలికారు. నేను వచ్చింది జబర్దస్త్ లోకా లేక రాజకీయాల్లోకా అని అనుమానం కలిగింది అని హైపర్ ఆది అంటాడు.

Hyper Aadi re entry into jabardasth counter on roja
Hyper Aadi

మరో కమెడియన్ స్కిట్ లో భాగంగా పరీక్ష రాసినప్పటికీ తనకి సీటు రాలేదు అని అంటాడు. వస్తుంది లేరా అని హైపర్ ఆది చెబుతాడు. ఏముంది.. రోజా గారికి మంత్రి సీటు రాలేదా.. ఇంద్రజ గారికి జబర్దస్త్ సీటు రాలేదా.. సీటు రావడం పెద్ద విషయం కాదు అన్నట్లు రోజాపై పరోక్షంగా హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జబర్దస్త్ నుంచి రోజా వెళ్ళిపోగానే నీకు నోరు ఎక్కువైపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఫైనల్ గా జబర్దస్త్ కి హైపర్ ఆది ఒక రేంజ్ లో రీఎంట్రీ ఇచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now