Rakul Preet Singh : హాస్పిట‌ల్ పాలైన ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. స్పృహ త‌ప్పి ప‌డిపోయింద‌ట‌.. కార‌ణం అదే..?

September 10, 2022 7:31 PM

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాధించింది ఈ బ్యూటీ.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హాస్పిటలైజ్ అయ్యిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ ఎక్కడ సినిమాలు చేసినా.. ఒక విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. బాడీ ఫిట్‌నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే.. ఆమె రోజులో ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా జిమ్ కే కేటాయిస్తుంది. ఒక్కోసారి రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ల మధ్య పెరుగుతున్న హెవీ కాంపిటేషన్.. వయస్సు దృష్టిలో ఉంచుకుని.. బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుకోవాలని.. ఆమె తెగ కష్టపడుతందట.

Rakul Preet Singh reportedly joined in hospital because of gym
Rakul Preet Singh

ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాజూగ్గా కనపడటానికి, జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్ చేస్తూ.. సృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారని సమాచారం. అయితే దీనిపై రకుల్ మేనేజర్ కానీ రకుల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించలేదు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే రకుల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ రకుల్ కి ఎలా ఉంది.. ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రకుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now