Bigg Boss : బిగ్ బాస్ సీజ‌న్ 6 విజేత‌కు ఎంత ఇవ్వ‌నున్నారో తెలుసా ? హౌస్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

September 10, 2022 3:16 PM

Bigg Boss : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. తెలుగులో గత ఆదివారం సీజన్ 6 ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు.. ఆ అవకాశం కోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తారు. బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వస్తే చాలు.. అప్పటి వరకు చేస్తున్న సీరియల్స్‌, షోలను వదులుకుని బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సిద్ధపడతారు. ఈ షో ద్వారా వచ్చే క్రేజ్‌ అలా ఉంటుంది మరి. ఇక పాపులారిటితో పాటు.. హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం లభిస్తుంది.

బాగా ఫేమ్‌ ఉన్నవారికి వారానికి ఏకంగా లక్షల్లో కూడా రెమ్యూనరేషన్‌ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో చివరి వరకు ఉండి టైటిల్ గెలిచేవారికి ఇప్పటి వరకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా అంతే మొత్తం ఉండనున్నట్లు సమాచారం. ఇక విన్నర్‌కి ప్రైజ్‌ మనీతో పాటు ప్రతి వారం రెమ్యూనరేషన్‌ లభిస్తుంది. అలాగే హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కి వారానికి చెల్లింపులు ఉంటాయి. ఇక కంటెస్టెంట్లకు ప్రతి వారం రూ.3 లక్షల నుంచి రూ.80 వేల‌కు తగ్గకుండా చెల్లింపులు ఉంటాయని సమాచారం. బాగా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లకి వారానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Bigg Boss Telugu 6 winner prize money
Bigg Boss

ఇక బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునకు సీజన్‌ పూర్తి అయ్యే వరకు భారీ మొత్తం ఇస్తున్నారని సమాచారం. సీజన్‌ 6 కోసం నాగార్జునకు ఏకంగా రూ.12 కోట్ల‌ నుంచి రూ.15 కోట్ల‌ వరకు చెల్లించనున్నట్టు టాక్. గత సీజన్‌ వరకు నాగార్జునకు రూ.8 కోట్ల వరకు ఇచ్చేవారని సమాచారం. ఈ సీజన్‌కు నాగ్‌ రెమ్యూనరేషన్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీ బిగ్‌బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.350 కోట్ల‌ పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. కాకపోతే అక్కడ వచ్చే రేటింగ్స్‌ కూడా భారీగానే ఉంటాయి. హిందీ బిగ్‌బాస్‌ మరీ బోల్డ్‌గా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now