Puri Jagannadh : లైగర్‌ ఎఫెక్ట్‌.. అద్దె కట్టలేక పూరీ జగన్నాథ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడా..?

September 10, 2022 1:26 PM

Puri Jagannadh : లైగర్‌ ఫ్లాప్‌తో మరో సారి పూరీ జగన్నాథ్‌ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో ఉన్న పూరీకి ఇస్మార్ట్ శంకర్ కొంత ఊరటనిచ్చింది. మాస్‌, డాషింగ్‌ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పూరీ ఆ మధ్య అ‍ప్పుల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో తిరిగి కెరీర్‌ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్‌తో లైగర్‌ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్‌ భారీ నష్టాలను మిగిల్చింది.

దక్షిణాదిలో భారీ వైఫల్యం చెందినా.. హిందీలో దాదాపు బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే.. విజయ్ దేవరకొండ రేంజ్ ఆమాంతం పెరిగేదని ట్రేడ్ వర్గాల అంచనా. పూరీ ఇమేజ్ కూడా మ‌రింత‌గా పెరిగేది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా పూరీ జ‌గ‌న్నాథ్ గ‌త ఏడాది ముంబైకి మ‌కాం మార్చాడు. ముంబైలో స‌ముద్రం సైడ్‌ ఫేసింగ్ 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ని రూ.10 ల‌క్ష‌లకు అద్దెకు తీసుకున్నాడ‌ట‌. మెయింటైన్స్ కూడా కలిపి మొత్తం రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు అద్దె చెల్లించేవారట. లైగ‌ర్ ఫ్లాప్ కావ‌డంతో రెంట్ క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఆ ఫ్లాట్‌ని ఖాళీ చేశాడ‌ని సమాచారం.

Puri Jagannadh reportedly vacated his mumbai flat
Puri Jagannadh

లైగర్ ఆశించిన విజయం సాధించి ఉంటే ఆయన కోసం బాలీవుడ్‌ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. పూరీ కూడా ఈ ఉద్దేశంతోనే ముంబైకి మకాం మార్చాడని సన్నిహితుల నుంచి సమాచారం. లైగర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే ఇక తాను ముంబైలోనే సెటిల్‌ అవ్యొచ్చనే ఉద్దేశంతో వెతికి మరీ పూరీ ఆ విలాసవంతమైన ఫ్లాట్‌ను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడట. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్‌ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు లైగర్‌ రూ.58 నుంచి రూ.60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now