ఆనంద‌య్య మందుకు జ‌గ‌ప‌తి బాబు స‌పోర్ట్‌.. బాబు గోగినేని సెటైర్లు..

June 12, 2021 6:17 PM

క‌రోనా బారిన ప‌డిన వారికి చికిత్స‌ను అందించేందుకు ఆనంద‌య్య మందును అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వివాదం నెల‌కొన్నా హైకోర్టు తీర్పుతో మళ్లీ మందు పంపిణీ ప్రారంభ‌మైంది. అయితే ఆనంద‌య్య‌కు అన్ని వ‌ర్గాల నుంచి అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. కానీ కొంద‌రు మాత్రం ఆ మందుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని ఆనందయ్య మందును చట్నీగా వ్యాఖ్యానించారు. అయితే ఆనంద‌య్య మందుకు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు మ‌ద్ద‌తుగా మాట్లాడడంతో బాబు గోగినేని జ‌గ‌ప‌తి బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

babu gogineni counters to jagapathi babu on anandaiah medicine

ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా.. అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ.. జ‌గ‌ప‌తి బాబు గ‌తంలో కామెంట్ చేశారు. దానికి బాబు గోగినేని స్పందించారు.

‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జ‌గ‌ప‌తి బాబుపై బాబు గోగినేని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

అయితే ఇటీవ‌లే జ‌గ‌ప‌తిబాబుపై ఓ ఇంగ్లిష్ వెబ్‌సైట్‌లో వార్త వ‌చ్చింది. ఆయ‌న త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌లో ఓ ఆయుర్వేద హాస్పిట‌ల్‌ను ఓపెన్ చేయ‌బోతున్నార‌ని అందులో ఉంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌ప‌తి బాబు ఆనంద‌య్య మందుకు మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారో, లేదో తెలియ‌దు కానీ.. ఆయ‌న ఆ మందు గురించి పాజిటివ్‌గా మాట్లాడ‌డంతో బాబు గోగినేని విమ‌ర్శించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now