Simran : నాటి త‌రం స్టార్ హీరోయిన్ సిమ్రాన్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

September 10, 2022 10:23 AM

Simran : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తన నటనకు గాను చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పట్లో సిమ్రాన్ కు ఒక రేంజ్ లో ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఉండేది. అబ్బాయిగారి పెళ్లి  చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సిమ్రాన్ మా నాన్నకు పెళ్లి చిత్రంలో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మొత్తానికి సిమ్రాన్ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందనే చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సిమ్రాన్ క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి అద్భుతమైన సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.

Simran is star heroine then see how is she now
Simran

ఆ తరువాత సిమ్రాన్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు ఊహించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో నటించిన సిమ్రాన్ కి ఒక సక్సెస్ కూడా దక్కలేదు.  ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ హీరో రజనీకాంత్ సరసన పేట‌ చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాధవన్ హీరోగా నటించిన రాకెట్రీ చిత్రంలో కూడా సిమ్రాన్ నటించారు.

తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసుకుంది. సిమ్రాన్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 46 ఏళ్ల వయసులో కూడా సిమ్రాన్ ఎంతో గ్లామర్ లుక్ తో నేటి తరం యువ హీరోయిన్ లను తలదన్నే అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. 45 ప్లస్ లో కూడా సిమ్రాన్ ఇంకా 25 ఏళ్ళ అమ్మాయిలా కనిపించడానికి గల అసలు కారణం ఏమిటి అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం సిమ్రాన్ తమిళ్ మరియు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now