Vijay Devarakonda : లైగ‌ర్ ఫ్లాప్.. విజ‌య్ చేసిన ప‌నికి శ‌భాష్ అంటున్న నెటిజ‌న్లు..

September 9, 2022 6:02 PM

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసింద‌ని చెప్పవచ్చు. కొన్ని సార్లు దర్శక నిర్మాతలు సినిమా కథాంశాన్ని హైలెట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశ‌లయ్యాయి.

లైగర్ చిత్రాన్ని  పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారిరు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.90 కోట్లు రాబడుతుందని లెక్కలు వేసుకుంటే రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ. 70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాలనుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతల‌ను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.

Vijay Devarakonda reportedly given his remuneration back for liger movie
Vijay Devarakonda

హీరో విజయ్ దేవరకొండకు నిర్మాతలు లైగర్ చిత్రానికిగాను రూ.15 కోట్లు పారితోషికం కింద ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆశించిన మేరకు ఫలితం సాధించకపోవడంతో నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని అర్థం చేసుకున్నాడు విజయ్. తనకు ఇచ్చిన పారితోషికంలో రూ.6 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ విశాల హృదయానికి అందరు ఫిదా అవుతున్నారు. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకొని విజయ్ దేవరకొండ పారితోషకం లో సగభాగం ఇచ్చేయడంతో అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు.

విజయ్ గత సినిమాలతో పోలిస్తే లైగర్ సినిమా కనీసం వాటి అంచనాలు కూడా చేరలేకపోయింది. విజయ్ దేవరకొండ సినిమాకు పెద్ద అండ అని అందరు అనుకున్నా అది కలగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో ఎదురైన‌  చేదు అనుభవం పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రం మీద పడకుండా పూరీ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now