Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

September 9, 2022 4:42 PM

Sitara Ghattamaneni : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన అందంతో, అభినయంతో అందర్నీ చూపులు తిప్పుకోకుండా కట్టి పడేస్తుంటాడు. ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మరింత గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యారో ఆయన గారాల పట్టి కూతురు సితార ఘట్టమనేని కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఓఒక‌ విషయంపై వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సితార గురించి మరొక విషయం వార్తల్లో వైరల్ అవుతుంది. తాజాగా సితార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పింది. ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sitara Ghattamaneni told her favorite heroine
Sitara Ghattamaneni

సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.  సితారకు సమంత అంటే ఎంతో ఇష్టం అని, నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతోంది సితార. బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో  పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో కలిసి సరదాగా గడిపానని సితార తెలియజేసింది. సమంతతో కలిసి టైమ్ స్పెండ్ చేయటం నాకు ఇష్టం అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు. 6 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది.. అని సితార ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మే 12న విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన పాటల ఆల్బమ్ పెన్నీ ప్రమోషనల్ వీడియోలో కనిపించి అందరిని ఆకట్టుకుంది సితార. ఈ పాటతో గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment