Bigg Boss : బిగ్ బాస్ ఒక బూతుల షో.. సీపీఐ నారాయణ కామెంట్స్ వైర‌ల్‌..

September 6, 2022 6:56 PM

Bigg Boss : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ షోకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా మరో కొత్త సీజన్ సెప్టెంబర్ 4న మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో ఘనంగా ప్రారంభమైంది.

ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్‌ ఎవరూ లేకపోవడం.. బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం నడిపించడం, ఒక్కొక్క అమ్మాయి చడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతూ సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్‌బాస్‌ పై సంచనల కామెంట్స్‌ చేశారు.

CPI Narayana sensational comments on Bigg Boss
Bigg Boss

దీని గురించి మాట్లాడుతూ.. కాసులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంత కాలం బిగ్‌బాస్‌లాంటి షోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అసలు ఈ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా ? బిగ్‌బాస్‌ అనేది ఒక అనైతిక షో. వింత జంతువులు ఈ హౌజ్‌లోకి వచ్చాయి అంటూ ఘాటుగా విమర్శించారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈయన మాటలపై ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment