Ram Charan : సేల్స్‌మెన్ అవ‌తారం ఎత్తిన రామ్ చ‌ర‌ణ్‌.. ఎందుకు..?

September 8, 2022 4:25 PM

Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్‌ చరణ్‌ క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. రామ్ చరణ్ వరల్డ్‌ వైడ్ గా ఎంతో ఫేమస్ అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయకు హాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

అంతేకాకుండా యాడ్స్‌లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన ఇంటి ముందుకు క్యూ కడుతున్నాయి. ఒక యాడ్ కి రామ్ చరణ్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ యాడ్స్ లో దూసుకుపోతున్నారు. ఈ కోవలోకి  రామ్ చరణ్ రాబోతోన్నాడు. సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోయారు రామ్ చరణ్.

Ram Charan ad video viral
Ram Charan

మరి కొద్ది రోజుల్లో హీరో బైక్ యాడ్ తో రామ్ చరణ్ జనాల ముందుకు రాబోతున్నారు. కొన్ని నెలల క్రితం అలియా భట్‌తో కలిసి రామ్ చరణ్ మాంగో ఫ్రూటీకి అంబాసిడర్‌గా యాడ్ లో నటించారు. ఇక ఇప్పుడు రండి బాబు విచ్చేయండి అంటూ మీషో ఆన్లైన్ షాపింగ్ కోసం సేల్స్ మెన్ గా అవతారమెత్తారు. రష్మిక గూడా ఫుల్ ఆఫ్ వెరైటీస్, డిస్కౌంట్ అంటూ సేల్స్ ఉమెన్ గా మారిపోయింది. క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కూడా దీని పైన కూడా డిస్కౌంట్ దాని పైన కూడా డిస్కౌంట్ అంటూ సేల్స్ మెన్ గా మీషో యాడ్ లో నటించారు.  రామ్ చరణ్, రష్మిక, సౌరవ్ గంగూలీ మీషో మెగా డిస్కౌంట్ సేల్ యాడ్ లో నటించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఆర్‌సి15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 50వ చిత్రం కావడంతో  ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now