Star Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?

September 7, 2022 11:03 AM

Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న  ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు.

2011 సంవత్సరంలో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రంలో నటించి సక్సెస్ ను అందుకుంది. ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు అందరి తో జత కట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Star Actress have you identified rakul preet singh in this photo
Star Actress

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో ఓబులమ్మ అనే డీగ్లామరస్ రోల్ లో నటించింది రకుల్.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. కొండపొలం చిత్రం తర్వాత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించడం లేదు. తెలుగు చిత్రలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ చిత్రాలకు దగ్గర అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో థాంక్యూ గాడ్ చిత్రంలో కూడా నటించింది. రకుల్  ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 మరియు లేడీస్ నైట్ అనే చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now