Gajuwaka Conductor Jhansi : మళ్లీ మాస్ డాన్స్ తో అదరగొట్టిన లేడీ కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైర‌ల్‌..

September 3, 2022 12:55 PM

Gajuwaka Conductor Jhansi : గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఝాన్సీ. షోలో వరసగా మూడో వారం కూడా ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. మాస్ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి.. స్టేజ్ మరోసారి దద్దరిల్లి పోయేలా చేసినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ టైమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ఝాన్సీ.. ఆ ఎపిసోడ్ లో ఠాగూర్ మూవీలోని గప్పు చిప్పు సాంగ్ కు ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత వారం.. పల్సర్‌ బైక్‌ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసి దుమ్మరేపింది. దీంతో ఝాన్సీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఇక ఈ సాంగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దాన్ని మించిపోయేలా శ్రీదేవి డ్రామా కంపెనీలో మరోసారి దుమ్మురేపినట్లు కనిపిస్తోంది.

Gajuwaka Conductor Jhansi latest dance video promo viral
Gajuwaka Conductor Jhansi

నెక్స్ట్ వీక్ కోసం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఈ విషయం అర్థమైపోయింది. వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్లు.. అనే ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది ఝాన్సీ. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రతీ వారం ఝాన్సీ డాన్స్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వుండేటట్లు మేనేజిమెంట్ ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. ఏదైతేనేం.. ఝాన్సీ లాంటి మహిళలు ఎంతో మందికి ఆదర్శం. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now