Star Heroine : అమ్మ‌కు చాక్లెట్లు తినిపిస్తున్న ఈమె.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

September 4, 2022 6:45 PM

Star Heroine : ప్రస్తుతకాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫోటోలు చూస్తే అసలు మనం చూసేది వీళ్ళనేనా అని ఆశ్చర్యపోయే విధంగా ఉంటున్నారు హీరో హీరోయిన్లు. ఇక అభిమానలు సైతం తమ ఇష్టమైన హీరో హీరోయిన్ల ఫోటోలు చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. త్రో బ్యాక్ పిక్చర్స్ ను, సోషల్ మీడియా లైవ్ ద్వారా  అభిమానులకు మరింత దగ్గరవుతారు.  ప్రస్తుతం ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిట్టి చేతులతో అమ్మకు చాక్లెటు తినిపిస్తూ ఎంతో క్యూట్ గా ఉంది. ఈ భామ ఇప్పుడు తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేస్తూ అ అభిమానులకు మరింత దగ్గరవుతుంది. ఆమె ఇంకెవరో కాదు.. అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం చిత్రంతో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద చిత్రంతో వరుణ్ తేజ్ తో జోడీ కట్టి నటన పరంగా అందర్నీ ఆకర్షించింది. అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్, ప్రభాస్ వంటి యువ హీరోల చిత్రాల్లో జంటగా నటించి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

have you identified Star Heroine pooja hegde in this picture
Star Heroine

మొదటి రెండు సినిమాల్లో ఎంతో డీసెంట్ గా కనిపించిన పూజా హెగ్డే ఆ తర్వాత  అల్లు అర్జున్ సరసన నటించిన దువ్వాడ జగన్నాథంలో గ్లామర్ డోస్ పెంచి కుర్రకారు మతులు పోగొట్టింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది.

ఇటీవలే మాల్దీవ్స్, పారిస్ లో దిగిన హాట్ గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందర్నీ ఫిదా చేసింది. ఇలా అందరిని ఆకట్టుకుంటున్న పూజ హెగ్డే చిన్నతనంలో ఎంతో క్యూట్ గా ఉన్న ఫోటోను చూస్తే నిజంగా ఈమె పూజాయేనా అని ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం పూజా హెగ్డే చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment