లైగ‌ర్ ఫ్లాప్ అవ‌డంపై శ్రీ‌రెడ్డి దారుణ‌మైన పంచ్‌లు.. పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఉతికి ఆరేసింది..

September 2, 2022 12:32 PM

ఎన్నో భారీ అంచనాలతో ఈ ఆగస్టు 25న విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపుగా రూ.120 కోట్లకు పైగానే బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాత‌లు భారీ న‌ష్టాల‌ను చ‌వి చూసేలా చేసింది. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మీల‌ నిర్మాణ భాగ‌స్వామ్యంలో క‌ర‌ణ్ జోహార్ స‌హ‌కారంతో బాలీవుడ్ లో కూడా ఆగ‌స్టు 25న‌ విడుద‌లైన సినిమా లైగ‌ర్. రిలీజైన రోజు రెండ‌వ షో నుండే క‌లెక్షన్లు దారుణంగా ప‌డిపోయాయి. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక కాంట్రవర్సి స్టార్ శ్రీ రెడ్డి కూడా లైగర్ చిత్రానికి రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టింది. శ్రీ రెడ్డి లైగర్ చిత్రానికి ఎన్ని మార్కులు వేసిందంటే..

లైగర్ సినిమా విడుదలైన వారం రోజులకు తన మార్క్ స్టైల్లో రివ్యూ ఇచ్చింది శ్రీరెడ్డి. చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు తగిలేట్టు పంచులు విసురుతూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది. కంటెంట్ లేని లైగర్ మూవీకి భారీ ప్రమోషన్స్ తో అంత హైప్ అవ‌స‌ర‌మా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీరెడ్డి. లైగ‌ర్ చిత్రం కంటే హీరో నిఖిల్ కార్తికేయ2 సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఇంకా లైగ‌ర్ ముందు లైగ‌ర్ త‌ర‌వాత అని ఇలాంటివ‌న్నీ మ‌న‌కు అవ‌స‌రమా అంటూ విమర్శించటం మొదలెట్టింది.

sri reddy criticized puri jagannadh for liger movie flop

తీసేవి అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. అసలు కంటెంట్ లేని చిత్రానికి మహేష్ బాబు డేట్స్ అవసరమా.. తిరిగి మళ్లీ మహేష్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో.. అసలు ఇది ఎంతవరకు కరెక్టు అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment