Surekha Vani : ఆ స్టార్ హీరోకు అయితే.. వంద ముద్దులు ఇస్తా.. అంటూ సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్..

September 1, 2022 2:59 PM

Surekha Vani : టాలీవుడ్ లో గ్లామర్ ఉన్న అతికొద్దిమంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒక‌రు. హీరో, హీరోయిన్లకు అక్క, వ‌దిన క్యారెక్ట‌ర్ లు చేస్తున్నా.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలో బిజీ బిజీగా సురేఖావాణి ఎమోష‌న‌ల్ సీన్ లు, కామెడీ సీన్ల‌లో సైతం న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌ తో టచ్‌ లోనే ఉంటూ ఉంటుంది. ఇక సురేఖ వాణి భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమార్తె సుప్రీతకు కూడా సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే సుప్రీత బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం చూశాం.

ఇప్పటికే సుప్రీత బుల్లితెర సెలబ్రిటీ అయిపోయింది. త‌ల్లి, కూతురు ఇద్ద‌రూ కలిసి పబ్బులకి వెళ్ళడంతోపాటు అక్కడ మందు గ్లాసులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో సైతం షేర్ చేస్తారు. ఆ ఫోటోలకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే సుప్రీత వాళ్లకు కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇదిలా ఉండ‌గా సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇటీవ‌ల‌ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఉందా అంటూ ప్రశ్నించగా ఇప్పుడైతే తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది.

Surekha Vani sensational comments on Pawan Kalyan
Surekha Vani

ఒకవేళ చేసుకుంటే బాగా డబ్బులు ఉన్నవాడు భర్తగా రావాలి అంటూ సిగ్గుపడింది. అలాగే త‌న‌ను బాగా చూసుకునే వాడు అయ్యి ఉండాల‌ని తన మనసులోని మాట చెప్పింది. సురేఖ కుమార్తె సుప్రీత మాత్రం త‌న త‌ల్లికి మ‌ళ్లీ పెళ్లి చేద్దాం అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఖాళీగా ఉందిగా.. చేసేద్దాం అని చెప్ప‌డం విశేషం. తాజాగా సురేఖ‌ను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోకు వంద ముద్దులు ఇస్తారు అని ప్రశ్నించగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అయితే వంద ముద్దులు ఇస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప‌వ‌న్‌పై సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now