Naga Chaitanya : బాల‌య్య కూతురితో నాగ‌చైత‌న్య‌ వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా..?

September 1, 2022 8:03 AM

Naga Chaitanya : ఏ మాయ చేశావె సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులు, చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.

అయితే వీరి విడాకుల తర్వాత మరో అంశం తెరమీదకు వచ్చింది. నాగ చైత‌న్య స‌మంతను కాకుండా ఎవ‌రిని పెళ్లి చేసుకునే వాడు.. అనే ప్ర‌శ్న చాలా మంది సినీ అభిమానుల‌లో మెదులుతోంది. నాగ చైత‌న్య ప్రేమ విష‌యం ఇంట్లో తెలియ‌క ముందు.. వారి కుటుంబ ఎవ‌రితో నైనా సంబంధం క‌లుపుకోవాలని చూసిందా అని చాలామందికి అనుమానం వస్తోంది. అయితే కొన్ని ప్ర‌శ్నలకు వివిధ సంద‌ర్భాల‌లో అక్కినేని నాగ‌ర్జుననే స‌మాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు మ‌రొక స‌మాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియ‌ర్ ఎన్టీఆర్, ఏన్నార్ ఉన్నప్పటి నుంచే రెండు కుటుంబల మ‌ధ్య మంచి స్నేహం ఉండేది.

Naga Chaitanya did not become son in law to Balakrishna this is the reason
Naga Chaitanya

ఆ స్నేహం.. బాల‌య్య, నాగార్జునల మ‌ధ్య కూడా కొనసాగింది. ఎవ‌రి ఇంట్లో ఏ శుభకార్యం జ‌రిగినా.. రెండు కుటుంబాలు త‌ప్ప‌క హాజ‌రు అయ్యేవారు. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వంగా మ‌లుచుకోవ‌డానికి బాల‌య్య, నాగ‌ర్జున రెడీ అయినట్టు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. బాల‌య్య చిన్న కూతురిని నాగ చైత‌న్యకు ఇచ్చి వివాహం చేయాల‌ని అప్ప‌ట్లో రెండు కుటుంబాలు నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని తెలిసింది. అయితే అప్పుడు నాగ చైత‌న్య స‌మంత ల‌వ్ మ్యాట‌ర్ చెప్ప‌డంతో ఈ నిర్ణయంపై వెన‌క్కి తగ్గార‌ని స‌మాచారం. నాగ చైత‌న్య స‌మంతను ల‌వ్ చేయ‌కుంటే.. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌య్యకు అల్లుడిగా ఉండే వాడ‌ని ప‌లువురు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now