Brahmaji : అనసూయను టార్గెట్ చేసిన బ్రహ్మాజీ.. ఆమెను అంత మాట అనేశాడేమిటీ..?

August 31, 2022 11:53 AM

Brahmaji : ఇటీవల సీనియర్ స్టార్ యాంకర్, నటి అనసూయని ట్విట్టర్ లో కొందరు నెటిజన్లు ఆంటీ అని పిలిచినందుకు కేసు వేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై చాలా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. రెండు రోజులు ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆంటీ అని పిలిస్తే వేధించినట్లేనని అనసూయ చెప్పడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్వీట్లు వేశారు. ఎంతమందిపై అని కేసులు వేస్తావు అంటూ సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు నటుడు బ్రహ్మాజీ ఈ టాపిక్ పై పరోక్షంగా ఓ జోక్ చేశారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఒక ఫొటోని షేర్ చేసి.. ఏం జరుగుతోంది..? అని ట్వీట్ వేశారు.

దానికి ఓ నెటిజన్ ఏం లేదు అంకుల్ అని బదులిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా..? అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా..? అయితే ఎన్ని కేసులు పెడతారు సార్..? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ఈ కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.

Brahmaji indirect comments on Anasuya posts viral
Brahmaji

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ చేసిన ట్వీట్ తోనే ఈ రచ్చ మొదలైందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ.. ఆంటీ.. అని పచ్చి బూతులు తిడుతూ ట్వీట్లు చేయడంతో అనసూయ దారుణంగా ట్రోలింగ్‌కి గురైంది. దీంతో అనసూయ కూడా తగ్గేదే లే అన్నట్టుగా.. తనని ట్రోల్ చేసేవారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. దీంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గకుండా ఆమెను ఆంటీ అంటూ రెట్టింపు ట్రోలింగ్ చేశారు. అనసూయ వెనుక ఎవరో ఉండి ఉంటారు లేకపోతే ఇంత చేయదు అని ఓ నెటిజన్ అంటే.. అవునూ నా వెనక ఎవరు ఉన్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది అనసూయ. ఇప్పుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కు అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now