Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఇలా మారిపోయాడేంటి..? ఏమైంది..?

August 30, 2022 7:21 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం నటించేందుకు సిద్ధం అవుతున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న‌ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అతడు, ఖలేజా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

ప్రస్తుతం మహేష్ ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని క్లాస్ లుక్ లో చూపించబోతున్నాడా.. లేక మాస్ లుక్ లో చూపించబోతున్నాడా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

Mahesh Babu latest look photo fans are very happy
Mahesh Babu

మహేష్ ముద్దుల తనయ చిన్నారి సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ డాన్స్ వీడియోల‌ను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలసి ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలయ్యింది. తండ్రితో కలసి సితార చేసే సందడిని చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. డాన్స్ అంటే ఒక సెలెబ్రేషన్స్ అని మహేష్ బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తాజాగా భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ బాబు  స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా కండలతో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం మహేష్ బాడీ బిల్డ్ చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. మహేష్ ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ అల్టిమేట్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారనేది పక్కాగా చెప్పవచ్చు. తొలిసారి మహేష్ బాబు ఈ విధంగా మీసాలు, గడ్డం పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పై ఎప్పుడూ పెద్ద మీసాలు, గడ్డం, షర్ట్ లేకుండా దర్శనం ఇవ్వలేదు. ఇక ఈ లుక్ మాత్రం మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. కాగా మహేష్ బాబు త‌న కూతురుతో కనిపించిన ఈ లుక్ మాత్రం వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now