Divorce : ఆ స్టార్ ఫ్యామిలీలో విడాకులు తీసుకోబోతున్న జంట‌..?

August 30, 2022 12:49 PM

Divorce : ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం చాలా సాధారణం అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.  గత రెండు సంవత్సరాల నుంచి విడాకులు తీసుకునే భార్య భర్తల సంఖ్య ఎక్కువైపోతుంది. గత ఏడాది అక్టోబర్ లో టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్  సమంత, నాగచైతన్య మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ సడెన్ గా ప్రకటించి అభిమానుల గుండెల‌లో ఒక్కసారిగా బాంబు పేల్చారు.

ఆ తర్వాత కొన్ని నెలలకే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ కూడా విడాకులు తీసుకొని ఇదే కోవలోకి వెళ్లిపోయారు.  వీరు విడాకులు తీసుకుని దాదాపు నెలలు గడుస్తున్నా అభిమానులు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కారణాలు బయటకు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఈ జంటలపై  వైరల్ అవుతున్నాయి. వీరు మాత్రమే కాకుండా ఆ తర్వాత అనేక జంటలు విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు.

that star actor brother getting Divorce
Divorce

ఈ క్రమంలోనే తాజాగా మరో సమాచారం వినిపిస్తోంది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఓ టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో మరో జంట‌కువిడాకులు మంజూరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన మరో స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో కి వరుసకి అన్న అయ్యే ఓ వ్యక్తి విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇతను స్టార్ హీరో బ్రదర్ అయినా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.

భార్యతో కొన్ని మనస్పర్ధలు కారణంగా మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య మనస్పర్ధలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యార‌ట‌. ఇరువైపుల పెద్దలు నచ్చచెప్పడానికి చూసినా కూడా జంట విడిపోవడమే మంచిదనే పూర్తిస్థాయిలో డెసిషన్ తీసుకున్నారట. ప్రస్తుతానికి వాళ్ల పేర్లు గోప్యంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఒక స్టార్ హీరో బ్రదర్ విడాకులు తీసుకొబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now