Namrata Shirodkar : న‌మ్ర‌త శిరోద్క‌ర్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. కార‌ణం అదే..!

August 30, 2022 8:02 AM

Namrata Shirodkar : ఈ మ‌ధ్య స్టార్ హీరోల బ‌ర్త్ డే ల సంద‌ర్భంగా వారి పాత హిట్ సినిమాల‌ను స్పెష‌ల్ షోల రూపంలో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌డం ఆన‌వాయితీగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం ఇలాగే మ‌హేష్ బాబు పోకిరి సినిమా స్పెష‌ల్ షోలు వేయ‌డం జ‌రిగింది. ఇదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా చిత్రం కూడా ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న ప్ర‌ద‌ర్శితం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ జ‌ల్సా సినిమా 4కె లో విడుద‌ల కానుంది. థియేట‌ర్ల సంఖ్య కూడా చెప్పుకోద‌గ్గ రీతిలోనే ఉంది. స‌ద‌రు షోల‌కు టికెట్ల బుకింగులు కూడా మొద‌ల‌వ‌డంతోపాటు ప‌లుచోట్ల అడ్వాన్సు బుకింగ్ లు స్పీడందుకున్నాయి. మెగా అభిమానుల సంబ‌రాలు కూడా అప్పుడే మొద‌లైపోయాయి.

మ‌రోవైపు కొంద‌రు మెగా అభిమానులు జ‌ల్సా మూవీ స్పెష‌ల్ షోల విష‌యంలో మ‌హేష్ బాబు ఇంకా న‌మ్ర‌తల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జ‌ల్సా సినిమా పోకిరి రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంద‌ని అందుకే వారికి మహేష్ బాబు కి చెందిన ఏఎంబీ సినిమాస్ లో జ‌ల్సా స్పెష‌ల్ షోల‌ను వేయ‌డం ఇష్టం లేద‌ని అందువ‌ల్ల వ్య‌తిరేకిస్తున్నార‌ని అంటున్నారు. ఇక ఏఎంబీ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ పై న‌మ్ర‌త ఆధిప‌త్యం ఉంది క‌నుక త‌నే ఇదంతా చేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రారంభించారు.

mega fans allegations on Namrata Shirodkar for that reason
Namrata Shirodkar

అయితే ఈ ఆరోప‌ణ అర్థం లేనిద‌నీ, జ‌ల్సా చిత్రం ఏఎంబీ సినిమాస్ లో విడుద‌ల అవుతుంద‌ని, బుకింగ్స్ కూడా మొద‌ల‌య్యాయ‌ని కొంద‌రు చెబుతున్నారు. ఏఎంబీ వారు ఆదాయంలో ఎక్కువ భాగం నిర్మాత‌ల‌నుండి డిమాండ్ చేస్తార‌ని, దీని కోసం జ‌రిగే చ‌ర్చ‌ల వ‌ల‌న జ‌ల్సా ప్ర‌ద‌ర్శ‌న నిర్ణ‌యం కొద్దిగా ఆల‌స్యం అయ్యింద‌ని, ఇంత‌లో కొంద‌రు హ‌డావిడి చేశార‌ని సిని వ‌ర్గాల స‌మాచారంగా తెలుస్తోంది. అయితే కొస‌మెరుపు ఏంటంటే ఏఎంబీ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ లో మ‌హేష్ బాబు వాటా చాలా త‌క్కువ కాగా ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ ది మెజారిటీ వాటాగా ఉంది. కానీ కొంద‌రు కావాల‌నే మ‌హేష్, న‌మ్ర‌త‌ల‌ను టార్గెట్ చేశార‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now