Khushi Movie : స‌మంత‌పైనే ఆశ‌లు పెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌.. ఏమ‌వుతుందో మ‌రి..!

August 29, 2022 10:44 PM

Khushi Movie : లైగ‌ర్ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో మరొక ప‌రాజ‌యం తోడైంది. ఆయ‌న‌ ఈ చిత్ర విజ‌యంపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ విజ‌య్ తోపాటు నిర్మాత‌లైన చార్మీ ఇంకా పూరీ జ‌గ‌న్నాథ్ ల‌ను కూడా కోలుకోలేని విధంగా దెబ్బ తీసింద‌నే చెప్ప‌వచ్చు. అయితే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ అంద‌రూ స‌మంత‌పైనే త‌మ ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నార‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలుస్తోంది.

ఇంత‌కీ అస‌లు విష‌యంలోకి వెళితే.. నిన్ను కోరి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత హీరో హీరోయిన్లుగా ఖుషి అనే సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం 2 ముఖ్య‌మైన‌ షెడ్యూళ్ల‌ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఓ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో స‌మంత చాలా బ‌ల‌మైన పాత్రలో చేయ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో విజ‌య్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

Khushi Movie Vijay Devarakonda fans hope on Samantha
Khushi Movie

ఇక లైగ‌ర్ సినిమా ప‌రాజ‌యంతో విజ‌య్ అభిమానులు త‌మ దృష్టిని ఖుషి చిత్రం వైపు మ‌ళ్లించిన‌ట్లు తెలిసింది. ఇక‌ స‌మంత ఈ మూవీలో న‌టిస్తుండ‌డంతో త‌ను క‌చ్చితంగా ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌నే భావిస్తున్నారు. స‌మంత స్క్రీన్ ప్ర‌సెన్స్ ఇంకా త‌న న‌ట‌న‌తో మ‌జిలీ సినిమాలో చేసిన‌ట్టుగానే దీంట్లో కూడా మ్యాజిక్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు. ఇందుకోసం స‌మంత పైనే భారం వేసి ఖుషి చిత్రం పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నారు.

అయితే లైగ‌ర్ డిజాస్ట‌ర్ తో పూరీ ఇంకా చార్మీలు బ‌య‌ట క‌నిపించ‌డం లేదు కానీ విజ‌య్ మాత్రం దుబాయ్ లో జ‌రిగిన ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో స‌ర‌దాగా మాట్లాడుతూ క‌నిపించి అభిమానుల‌ను అల‌రించాడు. ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రాబోతున్న ఖుషి చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now