Vijay Devarakonda : భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ట్రోల్స్‌.. ఇక్క‌డ కూడా వ‌ద‌ల్లేదుగా..!

August 29, 2022 1:09 PM

Vijay Devarakonda : భార‌త్‌, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వ‌స్తుంద‌టే చాలు.. క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆదివారం సాయంత్రం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఆసియా క‌ప్ 2022 టోర్నీలో భాగంగా నిర్వ‌హించిన ఈ మ్యాచ్‌లో భార‌త్‌.. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఏమోగానీ అంద‌రూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ట్రోల్ చేస్తున్నారు. అస‌లే లైగ‌ర్ మూవీ ఫ్లాప్ అయిన విచారంలో విజ‌య్ ఉండ‌గా.. ఆయ‌న‌ను నెటిజ‌న్లు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా భార‌త్‌, పాక్ మ్యాచ్ నేప‌థ్యంలో విజ‌య్‌ని మ‌ళ్లీ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసేందుకు విజ‌య్ దుబాయ్ వెళ్లాడు. ఆ మ్యాచ్‌ను చూశాడు. మ్యాచ్‌ను చూస్తుండ‌గా.. విజ‌య్‌ని కెమెరాల్లో చూపించారు. అంతేకాదు.. మైక్‌లో మాట్లాడాడు కూడా. అయితే విజ‌య్ మ్యాచ్‌ను వీక్షించ‌డం ఏమోగానీ.. ఆయ‌న వ‌ల్లే పాకిస్థాన్ ఓడింద‌ని అంటున్నారు. ఆయ‌న‌ది ఐర‌న్ లెగ్ అని.. ఆయ‌న లైగ‌ర్ మూవీ ఫెయిల్ అయి ఇక్క‌డ‌కు వ‌చ్చాడ‌ని.. దీంతో పాకిస్థాన్‌ను ఫెయిల్ చేశాడ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ ఎక్క‌డికి వెళ్లినా ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ట్రోల్స్ బాధ త‌ప్ప‌డం లేదు.

Vijay Devarakonda being trolled again for watching India vs Pakisthan match
Vijay Devarakonda

అయితే విజ‌య్‌ని ఇలా ట్రోల్ చేయ‌డం వెనుక కూడా బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. లైగ‌ర్ మూవీ రిలీజ్‌కు ముందు విజ‌య్‌తోపాటు చిత్ర యూనిట్ స‌భ్యులు త‌మ సినిమాపై త‌మ‌కు ఉన్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో అనేక కామెంట్స్ చేశారు. ఓటీటీ వాళ్లు రూ.200 కోట్లు ఇస్తామ‌న్నా వ‌ద్ద‌నుకున్నామ‌ని.. ఎందుకంటే త‌మ సినిమా ఇంకా అంత‌క‌న్నా ఎక్కువ వ‌సూలు చేస్తుంద‌ని అన్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివ‌ర్స్ అయింది. ఇలా మూవీ రిలీజ్‌కు ముందు అనేక సార్లు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా విజ‌య్‌, చార్మి, పూరీ చేసిన వ్యాఖ్య‌లే కొంప‌ముంచాయి. దీంతో ఇప్పుడు వారిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ ఎప్పుడు త‌గ్గుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now