Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టిన డిస్ట్రిబ్యూట‌ర్‌..!

August 28, 2022 3:38 PM

Vijay Devarakonda : పెళ్లిచూపులు సినిమాతో అరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ, కొన్నేళ్లుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకోవడమే కాకుండా చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ  టాప్ సౌత్ హీరోలలో ఒకడ‌య్యాడు. కొన్ని కారణాల వల్ల విజయ్ తో పనిచేసిన నిర్మాతలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం విజయ్ న‌టించిన‌ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆంధ్ర హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత, పంపిణీదారు అభిషేక్ నామా ఆ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజయం పాలవడంతో విజయ్ దేవరకొండ ప్రవర్తనతో విసుగు చెంద‌డం జరిగింది అంటూ ఓ సందర్భంలో వెల్లడించారు.

అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ కి ఇండస్ట్రీ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. విజయ్ కి ఇండస్ట్రీలో మార్కెట్ పెరగడం వల్ల వరల్డ్ ఫేమస్ లవర్ కి లాభాలు వస్తాయని నమ్మి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రాలేదు. ఒక హీరో చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకుని హీరో తగిన విధంగా స్పందించాలి. కానీ ఆ సమయంలో విజయ్ ఆ విధంగా చేయలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు.

distributor revealed truth about Vijay Devarakonda
Vijay Devarakonda

ఇలా బాధ్యతారహితంగా ఉంటే ఎలా.. ఈ ఒక్క సినిమాతోనే అయిపోదు. కనీసం నష్టపోయిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు సహాయం చేయకపోయినా.. తర్వాత వచ్చే చిత్రం డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా హామీ ఇవ్వలేదు. ఒక సినిమాని డిస్ట్రిబ్యూటర్లు కొనాలి అంటే అది ఆ హీరో పైన, ఆ సినిమా తీసే డైరెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలా విజయ్ దేవరకొండ లాగా బాధ్యతారహితంగా ఉంటే తర్వాత చిత్రాన్ని కొనడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు భయపడతారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ప్రభుత్వం కూడా ఏ సహాయం చేయలేదు. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక జూదం లాంటిది అంటూ వారు ఎదుర్కొనే సమస్యలను  వెల్లడించారు అభిషేక్ నామా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now