Bimbisara : బింబిసార, సీతారామం.. ఓటీటీల‌లో ఒకే రోజు రెండు మూవీల విడుద‌ల‌..

August 28, 2022 12:38 PM

Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్‏గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే కు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

అయితే అదే రోజు దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ ల సీతారామం కూడా విడుద‌లైంది. రష్మిక మందనా.. ఆఫ్రీన్ అనే కీ రోల్‌లో కనిపించింది. వీరి ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1960ల‌లో జరిగిన ఓ క్లాసికల్ లవ్ స్టోరీగా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో కూడా సీతారామం దూసుకుపోయింది.

Bimbisara and Sita Ramam on OTT know app details
Bimbisara

థియేటర్స్ లో అలరించిన ఈ రెండు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. బింబిసార ఓటీటీ హక్కులని జీ5.. సీతారామం హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న ఈ రెండు చిత్రాలు 5 వారాల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోనున్నాయి. కాబట్టి తాజా నిబంధనల ప్రకారం ఓటీటీ రిలీజ్ కి అదే సరైన టైం అని మేకర్స్ భావిస్తున్నారు. క‌నుక అదే తేదీ రోజు ఈ మూవీల‌ను ఆయా యాప్‌లు రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now