Viral Video : అక్ర‌మ సంబంధం పెట్టుకుని వ‌దిలివెళ్లిపోయిన భార్య‌.. బిడ్డ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్న రిక్షావాలా..

August 28, 2022 8:17 AM

Viral Video : రోజురోజుకూ మానవసంబంధాల విలువలు తగ్గిపోతున్నాయి. వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. భార్య లేదా భర్త చెడు ఆలోచనలతో పక్కదోవ పడిపోతున్నారు. అనవసరమైన కారణాలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. టెక్నాలజీతోపాటు రోజురోజుకూ మనుషుల తీరులో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమం వాడుక ఎక్కువవడంతో ప్రతి విషయం నిమిషాల్లో అందరి దృష్టిలోనూ పడుతోంది. తాజాగా ఓ బాధ్యతగల తండ్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్ల‌ దృష్టిలోకి వచ్చింది. ఈ వీడియో చూసి అంద‌రూ తెగ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా తండ్రిగా తన బాధ్యతను వదులుకోలేదు అంటూ ఆ రిక్షావాలాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.. రాజేశ్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం బీహార్ నుంచి ఉపాధి కోసం మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు వచ్చి అక్కడే ఉంటూ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు సంతానం కూడా కలిగారు. అయితే రాజేష్ భార్య కొన్ని నెలల క్రితం వేరే వ్యక్తి మోజులోపడి కడుపున పుట్టిన బిడ్డలను కాదనుకొని అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తితో వెళ్ళిపోయింది. భార్య వదిలి వెళ్ళిపోవడంతో తన బిడ్డలు అనాథలు  కాకూడదని వారిని రాజేశ్ అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

Viral Video rikshawala hard work for his children
Viral Video

కూతురికి మూడు సంవత్సరాల వయస్సు ఉండటంతో ఆమెను ఇంటి దగ్గరే వదిలి, ఏడాది కొడుకుని తన భుజంపై వేసుకుని రిక్షా తొక్కుతూ కష్టపడుతున్నాడు. రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో పిల్లల‌ను పోషిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నన్ను నా బిడ్డలను మరో యువకుడి కోసం అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయిన అలాంటి భార్య నాకు వద్దు. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని రాజేశ్ కోరుకుంటున్నాడు. అతడు రిక్షా తొక్కుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now