Anasuya : నెటిజ‌న్ల‌కు షాకిచ్చిన అన‌సూయ‌.. త‌న‌ను ట్రోల్ చేస్తున్న వారిపై ఫిర్యాదు..?

August 28, 2022 9:39 AM

Anasuya : ఆంటీ.. ఆంటీ.. ఆంటీ.. ట్విటర్‌లో ఎక్కడ చూసినా ఇదే పదం కనిపిస్తోంది. ఆంటీ అని పిలవడం ఏజ్‌ షేమింగ్‌ అని అనసూయ మండిపోతుంటే.. మేము మాత్రం ఆంటీ అని పిలవడం మానేదే లేదని మరింత రెచ్చిపోతున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్టార్ యాంకర్ అనసూయ అమ్మ‌ను అంటే ఆ ఉసురు ఊరికే పోదు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసింది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

ఇంకొందరై బూతులు తిట్టారు. ఈ క్రమంలో కొందరు అనసూయను అంటీ అని సంబోధించారు. దీనిపై అనసూయ ఫైర్ అయ్యింది. తనను ఆంటీ అంటూ వ‌య‌సు ఆధారంగా టార్గెట్ చేస్తున్నార‌ని, అలా అన్న వారిపై కేసు పెడ‌తానంటూ సీరియస్ అయ్యింది అనసూయ. దీంతో ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి స‌ద‌రు ఫ్యాన్స్ మ‌రింత‌గా ట్రెండ్ చేయటం ప్రారంభించారు. మ‌రోవైపు అన‌సూయ ఏమాత్రం త‌క్కువ తిన‌లేదు. త‌న‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించిన వారికి అంతే గ‌ట్టిగా స‌మాధానం ఇస్తూ వ‌స్తోంది.

Anasuya reportedly given complaint about her trollers
Anasuya

ఈ నేప‌థ్యంలో ఆంటీ అనే ప‌దం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ వివాదంలోకి శ్రద్దా దాస్‌ ఎంటరవుతూ అనసూయకు సపోర్టిచ్చింది. నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీకంటే రెట్టింపు వయసున్న అంకుల్స్‌ కన్నా కూడా నువ్వే హాట్‌గా కనిపిస్తావు. ఎల్లప్పుడూ నీకు అభిమానినే అని రాసుకొచ్చింది.

అయితే త‌న‌పై అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో కామెంట్స్ చేస్తున్న‌వారిపై అన‌సూయ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. కానీ అన‌సూయ కంప్లెయింట్ ఇచ్చింద‌నే అంటున్నారు. ఇక దీనిపై వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now