Niharika Konidela : ష‌ర్ట్ పైకి లేపి సిక్స్ ప్యాక్‌ చూపిస్తూ షో చేస్తున్న నిహారిక.. ఫొటో వైర‌ల్‌..!

August 26, 2022 7:52 PM

Niharika Konidela : మెగా డాట‌ర్ కొణిదెల నిహారికకు సినీ కెరీర్ ప‌రంగా పెద్ద‌గా క‌లిసి రాలేదు. దాదాపుగా సినిమాల‌కు దూర‌మైంద‌నే అనుకున్నారు. పెళ్లికి ముందు కాస్తో కూస్తో సినిమాల్లో క‌నిపించిన‌ప్ప‌టికీ పెళ్లి త‌రువాత ఒక్క సినిమాలో కూడా న‌టించ‌లేదు. కానీ టీవీ షోలు, వెబ్ సిరీస్ ల‌లో మాత్రం మెరుస్తూనే ఉంది. చైత‌న్య‌తో మ్యారేజ్ అయిన త‌రువాత త‌న స్టైల్ పూర్తిగా మారిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే పెళ్ల‌యిన త‌రువాత‌ కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు కాస్త లావెక్కిన‌ట్టు కూడా క‌నిపించింది.

అయితే ఈ మ‌ధ్య‌న త‌న భ‌ర్త‌తో క‌లిసి జిమ్ కి వెళ్ల‌డం కూడా స్టార్ట్ చేసిన నిహారిక మంచి ఫిజిక్ ను సాధించిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. ఇక ఆమె భ‌ర్త చైత‌న్య లేటెస్ట్ గా త‌న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వారిద్ద‌రూ క‌ల‌సి జిమ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో నిహారిక త‌న ష‌ర్ట్ ను పైకి లేపి స్లిమ్ గా త‌యారైన త‌న న‌డుము, ఇంకా పొట్ట భాగాన్ని చూపెడుతూ పోజ్ ఇవ్వ‌డం క‌నిపించింది. ఇక‌ ఈ ఫోటోని గ‌మ‌నించిన‌ట్లైతే నిజంగా నిహారిక చాలా బ‌రువు త‌గ్గిన‌ట్లుగానే తెలుస్తోంది. ఈ ఫోటోతో నిహారిక హాట్ నెస్ డోస్ ను కాస్త పెంచిన‌ట్లుగానే అనుకుంటున్నారు.

Niharika Konidela with her husband gym workout photo viral
Niharika Konidela

ఇక నిహారిక తాజా వెబ్ సిరీస్ హ‌లో వ‌ర‌ల్డ్ తో నిర్మాణ రంగంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. ఈ వెబ్ సిరీస్ ఈ మ‌ధ్య‌నే ఓటీటీ ప్లాట‌ఫామ్ జీ5లో విడుద‌లైంది. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనే నిహారిక ఇప్పుడు బిజీగా గ‌డుపుతోంది. ఇక మెగా అభిమానులు సినిమాల్లో ఈమె రీ ఎంట్రీ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now