Bandla Ganesh : ఆమె ఉసురు తగలడం వల్లే లైగర్ డిజాస్టర్ అయ్యిందా.. పూరీపై బండ్లన్న కామెంట్స్ మ‌ళ్లీ వైర‌ల్‌..

August 26, 2022 7:09 PM

Bandla Ganesh : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. ఫస్ట్ డేనే మూవీ ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ తప్ప.. సినిమాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేదని, పూరీ మార్క్ అసలే లేదని ఆడియెన్స్ అంటున్నారు. పూరీ ఇంతలా డిజపాయింట్ చేస్తారని ఊహించలేదని ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు. పూరీ కెరీర్లో లైగర్ డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.

ఇడియట్, పోకిరి లాంటి మాస్ మూవీస్ తీసిన పూరీ ఇతనేనా అని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ ప్రమోషన్స్ లో పూరీ బ్యాచ్ చేసిన అతి వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిని ఏకిపారేస్తున్నారు. విజయ్, ఛార్మి, పూరీ ఇలా ఎవరిని వదలకుండా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే పూరీ జగన్నాథ్ గతంలో చేసిన తప్పులను బయటకు తవ్వుతున్నారు. ఆ పాపమే నీ పాలిట శాపంగా మారింది అంటూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నారు. వాటిల్లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Bandla Ganesh old comments on Puri Jagannadh getting viral
Bandla Ganesh

ఆ మధ్య పూరీ కొడుకు ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు అన్నా.. కానీ వదినమ్మ నీకు శాశ్వతం.. నీకోసం వదినమ్మ పడిన బాధలు ఎన్నో నాకు తెలుసు. నీ కొడుకు ఫంక్షన్ కి రాలేనంత బిజీ అయిపోయావా నువ్వు ? ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్ అంతే.. వేరే పేరు రాస్తే తంతారు. పవిత్రను, ఆకాష్ ను బాగా సెటిల్ చెయ్యి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్.

పూరీ జగన్నాథ్ భార్యను గతంలో ఏడిపించాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనాడు పడిన బాధలు ఈనాడు ఛార్మి, పూరీ పాలిట శాపంగా మారాయ‌ని.. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ తో అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు.. అసలే సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉన్నాడు.. మీరు ఇంకా బాధ పెట్టకండ్రా బాబు.. అంటూ కూల్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment