Bigg Boss : పేరుకే బిగ్ బాస్ విన్నర్లు.. ఏమాత్రం క‌ల‌సిరాని షో టైటిల్‌..

August 26, 2022 10:06 AM

Bigg Boss : తెలుగులో బుల్లితెర‌పై అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన టీవీ షో బిగ్ బాస్. తెలుగు తెర‌పై ఈ షో సాధించిన టీఆర్పీ రేటింగ్స్ ను వేరే ఏ ఇత‌ర షో కూడా సాధించ‌లేక‌పోయింది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఈ షోకి అభిమానులుగా మారిపోయారు. కానీ ఇంత‌గా ప్రాచుర్యం పొందిన ఈ షో లో గెలుపొందిన వారికి మాత్రం ఆ త‌రువాత కెరీర్ లో క‌ల‌సిరావ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. షోలో గెలుపొంది బ‌య‌ట‌కు రాగానే హ‌డావిడి చేయ‌డం, ఎడాపెడా సినిమాలు, టీవీ షోలు చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం ఆ త‌రువాత క‌నుమ‌రుగైపోవ‌డం అల‌వాటుగా మారిపోయింది.

అయితే ఇలా జ‌ర‌గ‌డం అనేది బిగ్ బాస్ సీజ‌న్ 2 లో గెలుపొందిన కౌశ‌ల్ తో మొద‌లైంది. ఈయ‌న ఎన్నో వివాదాలు, హంగూ, ఆర్భాటాల మ‌ధ్య‌ బిగ్ బాస్ లో గెలుపొంది రాగానే అనేక సినిమాలు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించాడు. వాటిలో చాలా వ‌ర‌కు విడుద‌ల కూడా కాలేదు, కొన్ని విడుద‌ల అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల దృష్టికి రాకుండానే పోయాయి. దాదాపు బిగ్ బాస్ విన్న‌ర్స్ అంద‌రూ ఇదే ప‌రిస్థితిని చ‌విచూశారు.

Bigg Boss not brought any fame to winners
Bigg Boss

ఆ త‌రువాత సీజ‌న్ 4 లో విన్న‌ర్ గా నిలిచిన అభిజీత్, సీజ‌న్ 5 లో విజేత అయిన‌ వీజే స‌న్నీల విష‌యంలో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక వీజే స‌న్నీ కూడా బిగ్ బాస్ లో గెలుపొంది బ‌య‌ట‌కు రాగానే కొన్ని ప్రాజెక్టులు చేశాడు. కానీ వాటిలో ఏవీ విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇంకా ఇదే సీజ‌న్ 5 లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కూడా చాలా కాలం ఎదురు చూపుల త‌రువాత ఆహా ఓటీటీ ద్వారా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ తో ప‌ల‌క‌రించాడు. కానీ అత‌నికి అది ఆశించినంత‌గా ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయితే దీప్తి సున‌య‌న‌తో త‌న బ్రేక‌ప్ టాపిక్ మాత్రం ఈ వెబ్ సిరీస్ కంటే బాగా పాపుల‌ర్ అయ్యింది.

అదే విధంగా బిగ్ బాస్ లో వివిధ‌ సీజ‌న్లలో పాల్గొన్న వారు కూడా చాలా మంది ఆ త‌రువాత తెర‌మ‌రుగైపోవ‌డం కూడా జ‌రుగుతూనే ఉంది. అయితే వీరంతా బిగ్ బాస్ ద్వారా వ‌చ్చిన అభిమానుల‌ను, పాపులారిటీని త‌రువాత నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now