Roja : మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్న రోజా.. అస‌లు ఏమైంది..?

August 25, 2022 8:31 PM

Roja : గత కొంత కాలంగా  ఏపీ మంత్రులు వ‌రుస వివాదాల‌లో చిక్కుకుంటున్న విష‌యం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వార్తలు వ‌చ్చినా కూడా ఎవ‌రు లెక్క‌చేయ‌డం లేదు. తాజాగా మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కల‌సి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ అనుచరులలో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం కల్పించిగా.. మరో 20 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతోపాటుగా వచ్చిన అనుచరులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదంపై విమర్శలు సద్దుమణగ‌క‌ ముందే  రోజా మ‌రో వివాదంలో ఇరుక్కున్న‌ట్టు వార్తలు వెలువడుతున్నాయి.

మంత్రి రోజా మంగళవారం రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి రావడం జరిగింది. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహించడం జరిగింది. దోష నివారణ పూజ అనంతరం స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు రోజా. అభిషేకం పూర్తి అయిన అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొనడం జరిగింది. అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేయించి, అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో రోజా వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకులకు అందించి హారతి ఇవ్వమని చెప్పారు.

Roja again in controversy what happened
Roja

ఇదంతా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఆలయ నిబంధనల ప్రకారం భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా, మిగతా భక్తులు ఎవరూ దీపాల‌ను వెంట తెచ్చుకోవ‌ద్దు అని అక్కడ నిబంధన ఉంటుంది. కానీ వీఐపీల విషయంలో అందుకు భిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి రోజా తనతోపాటు దీపాలు తెచ్చుకున్నారు.  దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా రోజా ప్రవర్తించారు. ఇదంతా కూడా ఆలయ నిబంధనలకు విరుద్ధమని తెలిసిన కూడా మంత్రి గానీ, అధికారులు, అర్చకులు గానీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి రోజా చర్యలు తీవ్రవిమర్శలకు దారితీశాయి. ఆమెను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. మ‌రి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now