Vijay Devarakonda : ల‌వ్‌లో ఉన్న‌ట్లు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ వ్య‌క్తి ఎవ‌రు.. ర‌ష్మిక‌నేనా..?

August 25, 2022 5:51 PM

Vijay Devarakonda : ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో విజ‌య్ దేవ‌ర‌కొండ హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తోంది. అంతే కాకుండా విజ‌య్ న‌టించిన లైగ‌ర్ మూవీ త‌ప్ప ఇప్పుడు విడుద‌ల కాబోయే వేరే పెద్ద చిత్రాలు కూడా ఏమీ లేక‌పోవ‌డంతో ఎక్క‌డ చూసినా అత‌ని పేరే వినిపిస్తోంది. సాధార‌ణంగా విజ‌య్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి బ‌య‌ట ఎక్కువ‌గా చ‌ర్చించ‌డం చాలా అరుదు. కానీ తాజాగా ఒక ఇంగ్లిష్ న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్య్వూలో ప్రేమ ఇంకా బంధాల‌పై త‌న మ‌న‌సులోని విష‌యాల‌ను పంచుకున్నారు.

ఇక విజ‌య్ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ.. త‌న‌కు లాంగ్ రిలేష‌న్ షిప్ లో ఉండేలా ప్రేమ‌లో ప‌డ‌టం అంటే భ‌యం అనీ, ఎదిగే వ‌య‌సు నుండి ఇంట్లో త‌న‌కి డ‌బ్బే స‌ర్వ‌స్వం అని చెప్పార‌ని అన్నారు. జీవితంలో ఇంత వ‌ర‌కు త‌ను ఎవ‌రికి ఐ ల‌వ్ యూ టూ చెప్ప‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే చాలా రోజులుగా విజ‌య్, ర‌ష్మిక ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్న‌ట్టుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ఈ విష‌యాన్ని వారిద్ద‌రిలో ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కు ధృవీక‌రించ‌లేదు. కానీ విజ‌య్ తో లైగ‌ర్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న అనన్య పాండే కాఫీ విత్ క‌ర‌ణ్ అనే హిందీ షోలో మాట్లాడుతూ ఈ విష‌యం పై క్లారిటీ ఇవ్వ‌డం జ‌రిగింది. త‌ను మాట్లాడుతూ విజ‌య్ ఇంకా ర‌ష్మిక వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోయే అంశంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం జ‌రిగింది.

Vijay Devarakonda said about his love
Vijay Devarakonda

కానీ విజ‌య్ ఒక ఇంట‌ర్య్వూ లో మాట్లాడుతూ ప్రేమ‌లో ఉండ‌డం అనే ఫీలింగ్ త‌న‌కు ఇష్ట‌మ‌ని, తాను ప్రేమ క‌థ‌ల‌ను న‌మ్ముతాన‌ని, అవి త‌న‌కి సంతోష‌క‌ర‌మైన విష‌యాల‌ని అన్నారు. అలాగే త‌న‌కు ప్రేమ‌లో విఫ‌లం అవ‌డం అంటే కూడా భ‌య‌మ‌ని, కానీ ఇప్ప‌టివ‌ర‌కు అలా జ‌ర‌గ‌లేద‌ని త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఇంకా చిన్న‌త‌నంలో త‌న తండ్రి.. ప్రేమ అనేది ప‌నికిరాని విష‌యం అని, లోక‌మంతా డ‌బ్బు చుట్టూ తిరుగుతుంద‌ని త‌న‌తో చెప్పార‌ని, ఈ విష‌యాలు వింటూ తాను అలాగే పెరిగాన‌ని తెలిపాడు. ఇంత‌వ‌ర‌కు రిలేష‌న్ షిప్స్ ను తాను న‌మ్మ‌లేద‌ని, కానీ ఇప్పుడు ప్రేమను న‌మ్మ‌డం మొద‌లు పెట్టాన‌ని త‌న మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టాడు.

ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఇదివ‌ర‌కు దాని పైన త‌న‌కున్న అభిప్రాయాలు మారిపోయాయ‌ని తెలిపాడు. అయితే తాను ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డింది అనే విష‌యం మాత్రం ర‌హ‌స్యంగానే ఉంచాడు. దీంతో కొంద‌రు ఆ వ్య‌క్తి ర‌ష్మిక అనే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఒక‌ విధంగా విజ‌య్ త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌కు బ‌లాన్ని చేకూర్చిన‌ట్లు అయ్యిందని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now