శృతి హాసన్ ను ఫోన్ నెంబర్ అడిగిన అభిమాని.. శృతి రియాక్షన్ ఇదే ?

June 11, 2021 7:59 PM

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ టాలీవుడ్ ,బాలీవుడ్ ఇండస్ట్రీలలో క్రేజ్ ఉన్న సమయంలోనే ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో ప్రేమలో పడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్అప్ చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన “క్రాక్” మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలు,కెరీరకు సంబంధించిన విషయాలతో పాటు హాట్‌ ఫోటోలతో నెటిజన్లుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అందులో ఒక అభిమాని శ్రుతీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే కుదరదు అని చెప్పింది. అలాగే మరో అభిమాని మీ మొబైల్‌ నంబరు ఇస్తారా..? అని అడగ్గా శ్రుతి ఆహా! నా నంబరు కావాలా అంటూ కుదరదు అని సరదాగా చెప్పేశారు. దీంతో ఆ ఇద్దరీ అభిమానులను నిరాశపరిచింది శ్రుతీ.

శృతిహాసన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ హిట్ మూవీ “వకీల్ సాబ్” మూవీలో గెస్ట్ రోల్లో కనిపించింది. అలాగే “పిట్టకథలు ” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment