Sri Reddy : రుచికరమైన బిర్యానీతో పాటు నీతి సూక్తులు కూడా వల్లిస్తున్న శ్రీరెడ్డి..!

August 25, 2022 5:16 PM

Sri Reddy : కాంట్రవర్సీ స్టార్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పుడూ పెద్ద పెద్ద తారల‌పై విమర్శలు చేస్తూ ఏదో ఒక విధంగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఆ హీరోల ఆగ్రహానికి కూడా లోనవుతుంటుంది. అయితే ఆ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటోంది.

ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోల‌కు యూట్యూబ్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈమె పెట్టే ఏ వీడియోస్ అయినా నిమిషాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. రుచికరమైన వంటలు చేస్తూ యూట్యూబ్ లో వీడియోల‌ను అప్ లోడ్‌ చేస్తుంటుంది. పల్లెటూరి అమ్మాయిల చీరకట్టుతో, గల గల మాటలతో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Sri Reddy cooked biryani by telling some interesting things
Sri Reddy

ఓరిని  హడావిడి బ్రహ్మానందము అంటూ.. శ్రీరెడ్డి మిక్స్‌డ్ నాన్ వెజ్ బిర్యానీ  తయారీతోపాటు  తన నీతులు సూక్తులను కూడా చెప్పుకొచ్చింది.  అత్యున్నత మంచి మనస్తత్వం ఉండటం, అలాగే డబ్బు కలిగి ఉండే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళలో రతన్ టాటా గారు ఒకరు అని, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడికి లోను చేయకూడదని, మన విధానంలోనే వాళ్ల పెంపకం ఆధారపడి ఉంటుందని మంచి విషయాలు ఎన్నో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా స్త్రీలు బయటకు వెళ్లేటప్పుడు శరీరం మొత్తం కప్పుకునేలా దుస్తులు ధరించాలని సూక్తులు చెప్పుకొచ్చింది. బిర్యానీ కోసం అన్నీ సిద్ధం చేస్తూ, నన్ను చేసుకోబోయేవాడు ఎంత అదృష్టవంతుడు అంటూ తనను తాను పొగిడేసుకుంది. ఈ భామ ఉండే వంటల‌కు కూడా యూట్యూబ్ లో  ఫాలోయింగ్ బాగానే ఉంది. శ్రీ రెడ్డి ఒక వీడియోను యూట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now