Viral Photo : ఈ ఫోటోలోని చిన్నోడు ఫ్యాన్స్‌కు ఫేవరెట్ మాస్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..!

August 25, 2022 12:47 PM

Viral Photo : ఇటీవల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోషల్ మీడియా వినియోగం తప్పనిసరైంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ విశేషాలన్నింటినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పలువురు హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేయగా.. ఎన్టీఆర్ ఓల్డ్ రేర్ ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు.. తెలుగులో స్టార్ హీరో.. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవుతున్న ఈ హీరో తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. వరుసపెట్టి కమర్షియల్ సినిమాలు చేసి.. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తాజాగా కొమరం భీమ్ క్యారెక్టర్‌లో మరోసారి నటన‌ విశ్వరూపాన్ని చూపించాడు. ఈపాటికే మీరు గుర్తుపట్టి ఉంటారు. అది మరెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

have you identified Jr NTR in this Viral Photo
Viral Photo

నిన్ను చూడాలని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం 1తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆది, సింహాద్రి, యమ దొంగ, టెంపర్, అరవింద సమేత వీర రాఘవ లాంటి కమర్షియల్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో జీవించేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now