Kajal Aggarwal : గుడ్ న్యూస్ చెప్పిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌..!

August 23, 2022 2:46 PM

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ ఇపుడు వరుసగా సినిమాలు చేయడానికీ ఓకే చెబుతోంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని.. బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాగా.. రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాజల్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ల‌లో ఒకరైన ఫేమస్ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. సినిమాలో హీరోయిన్ గా కాదు కానీ సినిమాలో ఓ మెయిన్ క్యారెక్టర్ కోసం కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా స్టోరీ విన్న కాజల్ అగర్వాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Kajal Aggarwal re entry into movies
Kajal Aggarwal

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోందట. హీరో కూడా కొత్తవాడే కానీ కథ మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతుందట. ఇంకా చెప్పాలంటే సినిమాకి మెయిన్ హీరో.. హీరోయిన్ అన్నీ కాజల్ అన్నమాట. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కు ఈ సినిమానే కరెక్ట్ అని కాజల్ వెంటనే సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాజల్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూడాలి ఈ సినిమా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత పెద్ద హిట్ అవుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment