Varun Tej : ఆమె విష‌యంలో వ‌రుణ్ తేజ్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన నాగ‌బాబు..?

August 23, 2022 7:46 AM

Varun Tej : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకపక్క కామెడీ, మరోపక్క మాస్, ఇంకో ప‌క్క‌ రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. గద్దల కొండ గణేష్ వంటి పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టుని అద్భుతంగా డీల్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో సరికొత్త ప్రేమ కథ జోనర్ తో అదిరిపోయే విజయం అందుకున్నాడు. వరుణ్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు వరుణ్.

అయితే వరుణ్ రెండు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడనే వార్త వైరల్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు మిస్టర్, అంతరిక్షం సినిమాల్లోని కలిసి నటించారు. ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఇద్దరూ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Naga Babu given strong warning to Varun Tej because of her
Varun Tej

దీంతో వీరిద్ద‌రి ల‌వ్‌ మ్యాటర్ ను కన్‌ఫామ్‌ చేసుకున్నారు  మెగా ఫ్యాన్స్‌. చివరకు ఈ విష‌యం నాగ‌బాబు వరకు వెళ్లిందంట‌. ఆయ‌న వ‌రుణ్‌ను పిలిచి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చార‌ట‌. హీరోయిన్స్‌ను కోడ‌లుగా తెచ్చుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని.. కాబ‌ట్టి ఆమెకు దూరంగా ఉండాలంటూ చెప్పాడంట‌. లేదంటే నా కోపానికి బ‌లైపోతావంటూ సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి నిజంగానే నాగ‌బాబు వార్నింగ్ ఇచ్చాడా లేదా అన్న‌ది మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం దీన్ని వైర‌ల్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now