Roja : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మంత్రి రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితో ఎంట్రీ..

August 22, 2022 8:28 PM

Roja : టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్‌ హీరోయిన్‌ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్‌ లో ఉన్న అగ్ర హీరోలందరితోనూ కల‌సి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. మొదట తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత వైసీపీలో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు.

రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకున్నారు. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించారు. అయితే ఇప్పుడు రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ట‌. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు గ‌త కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్ప‌టికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావ‌డంతో అక్క‌డ శిక్ష‌ణ పొందుతోంది.

Roja daughter anshu may enter into movies
Roja

అక్క‌డ నుంచి వ‌చ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ సినీ వార‌సుడు హీరోగా నటించే సినిమాతోనే అన్షు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలుస్తోంది. నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌లో ఇప్ప‌టికే రాధ కూతుళ్లు తుల‌సి, కార్తీక‌, మంజుల కూతుళ్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కేవ‌లం జాన్వీ క‌పూర్ మాత్ర‌మే స‌క్సెస్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మరి రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now